లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. విక్రమ్ సినిమాతో భారీ హిట్ అందుకున్న కమల్ హాసన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. విక్రమ్ సినిమాలో కంప్లీట్ యాక్షన్ మోడ్ లో కనిపించిన కమల్ హాసన్.. తాజాగా ప్రభాస్ కల్కిలో నెగిటివ్ రోల్ లో కనిపించరు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమాలో కమల్ కనిపించేది తక్కువే అయిన తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ఇప్పుడు భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారతీయుడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇన్నాళ్లకు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు శంకర్.
ఇదిలా ఉంటే పై ఫొటోలో కమల్ హాసన్ తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్. ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్. ఆమె కోసం అభిమానులు పిచ్చెక్కిపోయేవారు. ఆమె ఎవరో తెలుసా.? అప్పటికి ఇప్పటికి ఆమె చాలా మారిపోయింది. ఇంతకు పై ఫోటోలో కమల్ తో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు మనీషా కొయిరాలా. ఈ ఇద్దరూ కలిసి భారతీయుడు సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా కలిశారు.
మనీష కొయిరాలా తమిళ్, హిందీ భాషల్లో చాలా సినిమాల్లో నటించారు. అలాగే తెలుగులోనూ పలు సినిమాలు చేశారు . తమిళ్ లో జంటిల్ మ్యాన్, భారతీయుడు, బొంబాయి సినిమాలో చేశారు. అలాగే హిందీలోనూ సినిమాలు చేశారు మనీషా కొయిరాలా..చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే మనీషా . హీరమండి అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్ లో మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు మనీషా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.