Nani Movie: నాని సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.. ? ఇప్పుడేం చేస్తున్నాడంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ వస్తాయా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. భారీ బడ్జె్ట్, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ఈ చిత్రం కోసం మహేష్ తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చుకున్నారు.

Nani Movie: నాని సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.. ? ఇప్పుడేం చేస్తున్నాడంటే..
Nani Movie

Updated on: Aug 29, 2025 | 4:26 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నారు. చివరగా గుంటూరు కారం సినిమాత సూపర్ హిట్ అందుకున్న మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ చిత్రీకరణ వేగంగా జరుగుతుంది. ఇందులో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. పలువురు హాలీవుడ్ స్టార్స్ సైతం కనిపించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొనగా.. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తారా ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవలే మహేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూూవీ నాని. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా మహేష్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

ఇవి కూడా చదవండి

నాని సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ కథానాయికగా నటించింది. ఇందులో దేవయాని, ఐశ్యర్య, నాజర్, రఘువరన్ కీలకపాత్రలో పోషించారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇందులో మహేష్ చిన్నప్పటి పాత్రలో నటించిన చిన్నోడు గుర్తున్నాడా.. ? అతడి పేరు మాస్టర్ ప్రధ్. ఈ సినిమాతో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో కనిపించి తన కామెడీ టైమింగ్, నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ చిన్నోడి ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమాతోపాటు హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఐశ్వర్య రాయ్, అర్బాజ్ ఖాన్ కలిసి నటించిన కుచ్ నా కహో చిత్రంలో నటించాడు. అలాగే ‘ముజ్సే షాదీ కరోగి’, ‘జోధా అక్బర్’, ‘చురా లియా హై తుమ్నే’, ‘బ్లాక్‌మెయిల్’, ‘కిడ్నాప్’ వంటి చిత్రాల్లో నటించాడు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమైన ఈ చిన్నోడు.. ఇప్పుడు నటనకు దూరంగానే ఉంటున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 30 సంవత్సరాలు. సినిమాలకు దూరంగా ఉంటున్న అతడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇటీవలే అతడు వివాహం చేసుకున్నాడు. నవంబర్ 2024లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన రాయల్ వెడ్డింగ్‌లో వివాహం చేసుకున్నాడు. అతడికి ఇన్ స్టాలో 6000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఇవి కూడా చదవండి : మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్‏లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..