
మనం టీవీల్లో ఎన్నో రకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి.. కొన్ని యాడ్స్ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పలు యాడ్స్ చాలా పాపులర్ అవుతుంటాయి. ఇక అందులో కనిపించే నటీనటులు కూడా చాలా ఫేమస్ అయిపోతుంటారు. కొంతమంది హీరోయిన్స్ కూడా అవుతుంటారు. చాలా మంది హీరోయిన్స్ గతంలో పలు యాడ్స్ లో నటించి ఆకట్టుకున్నారు. ఇలా యాడ్ ద్వారా పాపులర్ అయిన అమ్మాయిల్లో పైన కనిపిస్తున్న చిన్నది ఒకరు. ఆమె పేరు సాషా ఛెత్రి. ఈ పేరు అసలే తెలియదు జనాలకు. అదే ఎయిర్ టెల్ యాడ్ గర్ల్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ అమ్మాయికి సంబంధించిన ప్రతి హోల్డింగ్స్ కనిపించేయి.
అంతగా ఎయిర్ టెల్ సిమ్ యాడ్ ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ చిన్నది. అటు యాడ్.. ఇటు ఈ అమ్మాయి రెండు ఫేమస్ అయిపోయాయి. యాడ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సాషా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోనే బిజీ అవుతుందనుకుంటే ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. ఇంతకీ ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా..?
“ఇంతకంటే వేగంగా నెట్ వర్క్ వస్తే లైఫ్ టైమ్ మొబైల్ బిల్లు ఫ్రీ.. “అంటూ దేశం మొత్తం తిరుగుతూ ఎయిర్ టెల్ సిమ్ పై ఛాలెంజ్ విసిరే అమ్మాయిగా కనిపించింది. ఆమెను ఎయిర్ టెల్ 4జీ గర్ల్ అని కూడా పిలుస్తుంటారు. సాష పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో జన్మించింది. అక్కడే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన సాషా.. ఆ తర్వాత ముంబై వెళ్లి అడ్వర్టైజింగ్ స్టడీ అభ్యసించింది. ఎయిర్ టెల్ యాడ్ చేయడానికి ముందుకు సాషా ఓ యాడ్ ఏజెన్సీ లో కాపీ రైటర్ ట్రైనీ. అదే సమయంలో ఎయిర్ టెల్ యాడ్ కోసం ఆమెకు కాల్ వచ్చింది. అయితే ఆ కాల్ ఫేక్ అని వదిలేసింది. కానీ తిరిగి కాల్ చేయడంతో 2015లో ఎయిర్ టెల్ యాడ్ చేసింది సాషా. ఈ యాడ్ ద్వారా చాలా ఫేమస్ అయిన సాషా.. కత్తిబట్టి చిత్రంలో నటించింది సాషా. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా సింపుల్ లైఫ్ గడిపేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.