మొత్తానికి దొరికేసింది మావ..! సింగిల్ సినిమాలో ఈమెను గుర్తుపట్టారా.? ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

తెలుగు సినిమాల్లో ఇప్పుడిప్పుడే సక్సెస్ అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. సరికొత్త జానర్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవలే సింగిల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్ తో కడుపుబ్బా నవ్వించాడు.

మొత్తానికి దొరికేసింది మావ..! సింగిల్ సినిమాలో ఈమెను గుర్తుపట్టారా.? ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Actress

Updated on: Jun 22, 2025 | 10:41 AM

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సింగిల్. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు , వెన్నెల కిషోర్ తో కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మే 9న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా.. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ అదిరిపోయాయి. ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాడ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

అలాగే ఈ సినిమాలో వి.టి. గణేష్ కామెడీ కూడా అదిరిపోయింది. ఆయన కనిపించేది తక్కువ సేపే అయినా ఆ సీన్స్ బాగా పేలాయి. ఇదిలా ఉంటే సింగిల్ సినిమాలో వి.టి. గణేష్ సెక్రటరీగా నటించిన అమ్మడు గుర్తుందా.! సింగిల్ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆమె గురించి చాలా మంది నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. ఆమె ఎవరో కనిపెట్టి ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

ఆమె పేరు ఇందు.. నటుడు బండి సరోజ్ కుమార్ నటించిన మాంగల్యం అనే సినిమాలో నటించింది ఇందు.. ఆసినిమాలో ఆమె బోల్డ్ పాత్రలో కనిపించి షాక్ ఇచ్చింది. భర్తను మోసం చేసే భార్యగా కనిపించింది. ఆతర్వాత ఇప్పుడు ఇలా సింగిల్ సినిమాలో మెరిసింది. ఇక సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ అమ్మడి ఇన్ స్టా ఐడీ గురించి సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి