
సాధారణంగా సినిమా ప్రపంచంలో హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. సైడ్ క్యారెక్టర్స్ సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటాయి. యంగ్ తారలతో పోటీపడి మరీ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటీమణులు చాలా మంది ఉన్నారు. అందులో ఈ నటి ఒకరు. పైన ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్లతోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది. గ్లామరస్ లుక్స్ లో కనిపించి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పేరు సోనా హైడెన్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.
ఇవి కూడా చదవండి : Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..
సూపర్ స్టార్ రజినీకాంత్, జగపతి బాబు కలిసి నటించిన కథానాయకుడు చిత్రంలో కీలకపాత్ర పోషించింది. డైరెక్టర్ పీ. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్ భార్యగా కనిపించింది. ఇందులో తన లుక్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అజిత్, జ్యోతిక నటించిన పూవెల్లం ఉన్ వాసం చిత్రంతో సోనా తెరంగేట్రం చేసింది. ఇందులో జ్యోతిక స్నేహితురాలిగా నటించింది. ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సోనాకు తెలుగుతోపాటు తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే అప్పట్లో సోనా ఎక్కువగా గ్లామరస్ లుక్స్ ఉన్న పాత్రలలోనే కనిపించింది. సైడ్ క్యారెక్టర్స్ అయినప్పటికీ ప్రతి సినిమాలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..
2003లో ఆయుధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే రవితేజ నటించి వీడే, ఎన్టీఆర్ ఆంధ్రావాలా చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. సోనా హైడెన్ నటిగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ పలు సీరియల్స్ నిర్మిస్తూ బిజీగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రస్తుతం ఆమె లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‌లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..
ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..