
సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. కుర్రాళ్ళు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇంటర్ నెట్ పుణ్యమా అని కొత్త కొత్త విషయాలతో పాటు.. ఎక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. అలాగే సినిమాల విషయానికొస్తే సినిమా అప్డేట్స్ తో పాటు .. హీరో, హీరోయిన్స్ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. అలాగే సినీ సెలబ్రెటీలకు సంబందించిన చిన్ననాటి ఫోటోలు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. హీరో, హీరోయిన్స్ ఫోటోలను నెటిజన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తుంటారు. తాజాగా ఓ త్రో బ్యాక్ ఫోటో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పై ఫోటో గమనించారా.? ఈ ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? చాలా మందికి ఆయన పేరు బాగా నోటెడ్ అనే చెప్పాలి. ఇంతకు పై ఫొటోలో ఉన్న ఆయన ఎవరో చెప్పుకోండి చూద్దాం.! ఆయన పేరు చెప్తే షాక్ అయ్యి పోతారు.
ఇంతకు పై ఫొటోలో ఉన్న ఆయన మరెవరో కాదు. రీసెంట్ డేస్ లో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి. నిజానికి ఈయన చాలా మందికి తెలుసు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేణు స్వామి పేర న్యూస్ కఛానెల్స్ లో పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఎక్కువగా వినిపిస్తుంది. సెలబ్రెటీల జాతకాలు చెప్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ప్రముఖ జోతిష్యులు వేణు స్వామి.
ఇక పై ఫోటో మహేష్ బాబు నటించిన రెండో సినిమా యువరాజు మూవీ షూటింగ్ సమయంలోది. ఈ సినిమాకు పూజాకార్యక్రమం నిర్వహించింది వేణు స్వామినే.. ఈ ఫొటోలో మహేష్ బాబుతో పాటు దర్శకుడు వైవిఎస్ చౌదరి కూడా ఉన్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఆయన చాలా సినిమాలకు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఇక మొన్నామధ్య హీరోయిన్స్ కు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్తున్నారు వేణు స్వామి. ఇప్పటికే హీరోయిన్స్ డింపుల్ హయతి, నిధి అగర్వాల్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనేక వివాదాల్లోనూ చిక్కుకున్నారు వేణుస్వామి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.