ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

|

Nov 20, 2024 | 8:51 PM

విలక్షణ అన్న మాట వింటే ఆయన పేరే గుర్తొస్తుంది. ఇలా కూడా నటిస్తారా అని అందరూ షాక్ అవుతారు. చిన్న చిన్న సినిమాలనుంచి మొదలుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.

ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?
Tollywood
Follow us on

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప నటులు ఉన్నారు. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ఆ పాత్రను వాళ్ళు తప్ప మరొకరు చేయలేరు అనేంతగా ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. రొటీన్ కు భిన్నంగా విభిన్నమైన పాత్రలు చేస్తూ తామంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు చాలా మంది. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. విలక్షణ అన్న మాట వింటే ఆయన పేరే గుర్తొస్తుంది. ఇలా కూడా నటిస్తారా అని అందరూ షాక్ అవుతారు. చిన్న చిన్న సినిమాలనుంచి మొదలుకొని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతోన్నాడు ఆ హీరో.. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఆయన ఓ పాత్ర చేస్తే అలా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఇంత బిల్డప్ ఇస్తున్నాడు ఇంతకూ ఆయన ఎవరా అనుకుంటున్నారా..?

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

హీరోగానే కాదు.. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసి ప్రేక్షకులను మెప్పించగల నటుడు. తన ఇండస్ట్రీలోనే కాదు అన్ని భాషల్లో ఫెమస్ అయ్యాడు. అలాగే తెలుగులోనూ తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయనే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. మలయాళ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు ఆయన. వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు ఫహద్. ఇక ఇప్పుడు విలన్ గా మారి పుష్ప సినిమాతో ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.ఇక ఇప్పుడు పుష్ప 2లో నటిస్తున్నాడు.  బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ నటిస్తున్నారు. పుష్ప మొదటి పార్ట్ లో ఆయన పాత్ర ఎక్కువ సేపు ఉండదు. కనిపించింది కొంత సేపే అయినా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2లో ఆయన పాత్ర మరింత బలంగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా తప్పకుండా సంచలన హిట్ అవుతుందని అంటున్నారు.

బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..