చెప్పవే చిరుగాలి హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి ఏం చేస్తుందంటే
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ప్రేక్షకులకు దగ్గరయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో తెలుగు తెరపై సందడి చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.. కానీ అతి కొద్ది సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. మొదటి సినిమాలోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేక చిన్న చిన్న సినిమాలతో సర్దుకుపోతారు.

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త నటీనటులు సందడి చేస్తుంటారు. ముఖ్యంగా అందాల తారలు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అయితే తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉండగా.. ఒకటి రెండు చిత్రాలతో ఇండస్ట్రీకి దూరమైనవారున్నారు. అందం, అభినయంతో మెప్పించి జనాల మదిలో నిలిచిపోయిన హీరోయిన్లలో అషిమా భల్లా ఒకరు. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు.. కానీ చెప్పవే చిరుగాలి హీరోయిన్ నిర్మల అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పాత్రతో అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది అషిమా.
2001లో ఫ్యార్ జిందగీ హై అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. తెలుగులోనే కాకుండా.. తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాతో మరోసారి అలరించింది. ఇందులో నిర్మల పాత్రలో ఆమె నటన మెప్పించింది.
2010లో చివరిగా తంబి అర్జునుడు అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత పలు టీవీ షోల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అషిమా. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులు కట్టుకుంటున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి



