Actress: ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.. రీసెంట్‌గా హిట్ కొట్టి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ భామ

|

Jan 19, 2023 | 11:52 AM

తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పై ఫొటోలో ముద్దులొలుకుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

Actress: ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.. రీసెంట్‌గా హిట్ కొట్టి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ భామ
Actress
Follow us on

సినిమా తరాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను ఎక్కువగా వెతుకుతుంటారు కొందరు. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పై ఫొటోలో ముద్దులొలుకుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడు ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. రీసెంట్ గా రిలీజ్ అయినా సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఇంతకు ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.

పై ఫొటోలో ఉన్న బూరె బుగ్గల బుజ్జాయి మరెవరో కాదు.. మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్.. మలయాళ ఇండస్ట్రీకి చెందిన హనీ రోజ్.. రీసెంట్ గా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక వీరసింహారెడ్డి సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇక చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటోంది హనీ. ఇక వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. ఇక హనీ రోజ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Honey Rose