ఈ ఫొటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా..? అమ్మాయిల మనసు దోచేసిన యంగ్ హీరో అతను

పైన కనిపిస్తున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? సోషల్ మీడియాలో ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఏది షేర్ చేసినా అభిమానులకు ఫుల్ కిక్ అనే చెప్పాలి. పై ఫొటోలో ఉన్నది ఓ స్టార్ కిడ్‌. నటనతో అందరి మనసులు గెలుచుకున్నాడు ఆ యంగ్ హీరో.

ఈ ఫొటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా..? అమ్మాయిల మనసు దోచేసిన యంగ్ హీరో అతను
Bollywood

Updated on: Dec 28, 2023 | 9:27 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని నటీనటులు రకరకాల కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. చాలా మంది కష్టపడి ఈరోజు స్టార్స్ గా పేరు తెచ్చుకున్నారు. పైన కనిపిస్తున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? సోషల్ మీడియాలో ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఏది షేర్ చేసినా అభిమానులకు ఫుల్ కిక్ అనే చెప్పాలి. పై ఫొటోలో ఉన్నది ఓ స్టార్ కిడ్‌. నటనతో అందరి మనసులు గెలుచుకున్నాడు ఆ యంగ్ హీరో. ఇంతకీ ఆ నటుడు ఎవరో కనిపెట్టారు.?. బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఫోటోలో ఉన్న  అబ్బాయిని మీరు గుర్తించగలరో లేదో చూడండి.

అతను మరెవరో కాదు బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ యాక్టర్‌ వరుణ్‌ ధావన్‌. తొలి సినిమాతోనే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌ని వివాహం చేసుకున్నాడు. నటాషాకు వరుణ్ నాలుగు సార్లు ప్రపోజ్ చేశాడు. కానీ నటాషా అప్పుడు ఒప్పుకోలేదట.. కానీ చివరికి వరుణ్ ఆమెను పొందాడు.

వరుణ్ ధావన్ 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఎన్నో కామెడీ, సీరియస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆసక్తికరమైన సినిమాలు కూడా చేశాడు. వరుణ్ కూడా తన లవ్ లైఫ్ కారణంగా వార్తల్లో నిలిచాడు. అలియా నుంచి తాప్సీ పన్ను వరకు అతను చాలా మందితో ప్రేమాయణం నడిపాడని వార్తలు వచ్చాయి. కానీ అతను ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను వివాహం చేసుకున్నాడు. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ నటుడు గోవిందాతో ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. అయితే కొడుకుని స్టార్‌ని చేయాలనుకున్నంత సక్సెస్ మాత్రం ఇంకా అందుకోలేకపోయారు. వరుణ్ ధావన్ కూడా ఇంకా కష్టపడుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.