
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా ఎదిగారు. కొంతమంది హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేసినా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా అంతే.. పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఈ చిన్నది బాలీవుడ్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆతర్వాత తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ అందం అభినయం ఉన్న ఈ అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇంతకూ ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..
2008లో ‘జన్నత్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. సోనాల్ మొదటి చిత్రం నుంచి నేషనల్ క్రష్‌గా మారిపోయింది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో చేసినా.. ఈ బ్యూటీకి రావల్సినంత క్రేజ్ రాలేదు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో నటించి ఈ చిన్నది కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.
1987 మే 16న నోయిడాలో సోనాల్ చౌహాన్ జన్మించింది. సోనాల్ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత, సోనాల్ ఢిల్లీలోని గార్గి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం 2005లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టైటిల్ గెలుచుకున్న తొలి ఇండియన్‌గా సోనాల్ నిలిచింది. హిమేష్ రేష్మియా మ్యూజిక్ ఆల్బమ్ ఆప్కా సురూర్‌లోని ‘సంఝో నా’ పాటలో సోనాల్ మొదటిసారి కనిపించింది. ఇక ఇమ్రాన్ హష్మీతో కలిసి జన్నత్(2008) చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనాల్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. సోనాల్‌కి ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏం రాలేదు.
2013లో, ‘3G- ఎ కిల్లర్ కనెక్షన్’ అనే చిత్రంలో నటించింది సోనాల్ చౌహాన్. ఇందులో నీల్ నితిన్ ముఖేష్ హీరోగా నటించాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. కానీ రికార్డు బ్రేకింగ్‌గా ఈ చిత్రంలో 30 కిస్ సీన్స్ ఉన్నాయి. గతంలో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ చిత్రం మర్డర్ సినిమాలో అత్యధికంగా 20 కిస్ సీన్స్ ఉండగా.. ఆ రికార్డును3G సినిమా(30 కిస్ సీన్స్) బ్రేక్ చేసింది. సోనాల్ చౌహాన్ హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఆమె మొదటి తెలుగు చిత్రం రెయిన్‌బో(2008). ఆ తర్వాత నాగార్జున, ప్రభాస్, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక సోనాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.