AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైడ్ క్యారెక్టర్స్ నుంచి స్టార్ హీరోగా.. ఈ ఫొటోలో ఉన్న చిన్నోడు అమ్మాయిల డ్రీమ్ బాయ్

ఒక హీరోకో లేదా ఓ హీరోయిన్‌కో ఆడియన్స్ కనెక్ట్ అయ్యితే చాలు వాళ్ల క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక మన టాలీవుడ్ లో ఇలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోలు చాల మంది ఉన్నారు. పై ఫొటోలో ఉన్న బుడతడు ఇప్పుడు అమ్మాయిలా డ్రీమ్ బాయ్.. అతనంటే పడి చచ్చిపోతారు అమ్మాయిలు.. ఇంతకు అతను ఎవరో గుర్తుపట్టారా.?

సైడ్ క్యారెక్టర్స్ నుంచి స్టార్ హీరోగా.. ఈ ఫొటోలో ఉన్న చిన్నోడు అమ్మాయిల డ్రీమ్ బాయ్
Tollywood
Rajeev Rayala
|

Updated on: May 09, 2024 | 8:20 AM

Share

సోషల్ మీడియాలో నిత్యం సినిమాలకు సంబందించిన ఫోటోలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సినీ లవర్స్ తమ అభిమాన హీరోల ఫోటోలు, హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉంటారు. ఒక హీరోకో లేదా ఓ హీరోయిన్‌కో ఆడియన్స్ కనెక్ట్ అయ్యితే చాలు వాళ్ల క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక మన టాలీవుడ్ లో ఇలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోలు చాల మంది ఉన్నారు. పై ఫొటోలో ఉన్న బుడతడు ఇప్పుడు అమ్మాయిలా డ్రీమ్ బాయ్.. అతనంటే పడి చచ్చిపోతారు అమ్మాయిలు.. ఇంతకు అతను ఎవరో గుర్తుపట్టారా.? ఈ తెలుగు హీరోకు బాలీవుడ్ భామలు కూడా క్యూలో ఉన్నారు. ఇంతలు ఆ చిన్నాడు ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో అమాయకంగా పిల్లల మధ్య ఉన్న ఆ హీరో ఎవరో కాదు..

ఇండస్ట్రీలో ఎదగడం అంటే అంత ఈజీ కాదు. తనను తాను నిరూపించుకుంటూ ఒకొక్క మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నారు హీరోలు. పై ఫొటోలో ఉన్న బుడతడు కూడా అంతే సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ఆతర్వాత హీరోగా ఎదిగాడు ఆ చిన్నోడు. ఇంతకు అతను ఎవరంటే.. అమ్మాయిలా డ్రీమ్ బాయ్ విజయ్ దేవరకొండ. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు. విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు అభిమానులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.

విజయ్ సినీ కెరీర్ లో ముందుగా సైడ్ రోల్స్ చేసి అలరించాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్విలా, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చిన్న రోల్స్ లో నటించాడు. ఆతర్వాత 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ద్వారకా అనే సినిమా చేశాడు. కానీ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.  మహానటి, గీతగోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ , ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు విజయ్ దేవరకొండ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us