ఈ ఫొటోలో సూపర్ స్టార్‌తో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? అతను ఓ స్టార్ హీరో

|

Apr 17, 2024 | 10:29 AM

ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యి హీరోలు అన్ని భాషల్లో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంటున్నారు. కానీ ఇవేమి లేనప్పుడే సూపర్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఏడుపదుల వయసులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే జైలర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న సూపర్ స్టార్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

ఈ ఫొటోలో సూపర్ స్టార్‌తో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? అతను ఓ స్టార్ హీరో
Rajinikantha
Follow us on

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఫ్యాన్ కానీ వారు ఉండరేమో.. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆయన స్టైల్ కు ప్రేక్షకులంతా ఫిదా అవుతారు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యి హీరోలు అన్ని భాషల్లో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంటున్నారు. కానీ ఇవేమి లేనప్పుడే సూపర్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఏడుపదుల వయసులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే జైలర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న సూపర్ స్టార్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే పైన సూపర్ స్టార్ తో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? రజినీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఆయన.. అంతే కాదు హీరోగానూ రాణిస్తున్నారు. ఇంతకు అతను ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫోటోలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఉన్న చిన్నోడు ఎవరో కాదు.. దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్..ఫేమస్ డైరెక్టర్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, హీరోగా రాణిస్తున్నారు లారెన్స్. తన డాన్స్ లతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు లారెన్స్.  కొరియోగ్రఫర్ గా ఎన్నో పాటలకు, స్టార్ హీరోలకు చేశారు. ఇక దర్శకుడిగా మారి సినిమాలు చేశారు.

లారెన్స్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఆయన స్టైల్ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే డాన్, రెబల్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇటీవలే చంద్రముఖి 2లో చేశారు లారెన్స్. ప్రస్తుతం ఆయన లోకేష్ కానగరాజ్ తో సినిమా చేస్తున్నారు. లారెన్స్ పలు సేవ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఎంతో మంది పేద వాళ్ళను, అనాధ పిల్లలను ఆదుకున్నారు లారెన్స్.

లారెన్స్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.