AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. ఇప్పుడు ఏం చేస్తుందంటే.. ఈ నటి గుర్తుందా.. ?

సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇప్పుడు సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు నెటిజన్స్. అలాగే ఒకప్పటి నటీనటులు ఎక్కడా కనిపించినా వెంటనే ఫోన్లలో బంధిస్తున్నారు. తాజాగా ఒకప్పుడు సినిమాల్లో అలరించిన పాపులర్ నటి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.

Tollywood: అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. ఇప్పుడు ఏం చేస్తుందంటే.. ఈ నటి గుర్తుందా.. ?
Bhuvaneswari Photos
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2024 | 6:51 PM

Share

బుల్లితెరతోపాటు వెండితెరపై సందడి చేసింది. అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి తనదైన నటనతో పేరు తెచ్చుకుంది. 2003లో వచ్చిన బాయ్స్ సినిమాతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన నటి భువనేశ్వరి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్ర కుర్ కురే. ఆ తర్వాత తెలుగులో దొంగ రాముడు అండ్ పార్టీ సినిమాతో ఫేమస్ అయ్యింది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, సీమ శాస్త్రి, ఆంజనేయులు వంటి సినిమాల్లో నటించింది.

తెలుగుతోపాటు పలు తమిళ చిత్రాల్లో సైతం నటించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే వెండితెరకు దూరమైంది. ఆ తర్వాత కొద్ది రోజులు తమిళనాట పలు సీరియల్స్‌లో నటించింది. 2015 తర్వాత నుంచి సినీరంగానికి పూర్తిగా దూరమయ్యింది. అటు సిల్వర్ స్క్రీన్‌పై, ఇటు బుల్లితెరపై కనిపించలేదు. భువనేశ్వరి ఏపీలోని చిత్తూరులో జన్మించింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.

భువనేశ్వరి చిన్నప్పటి నుంచి చదువులలో చురుకుగా ఉండేది. కానీ సినిమాల్లో నటించాలని కలలు కనేది. దీంతో కాలేజీ రోజుల్లోనే సినీరంగంలో ట్రై చేయాలని ఫ్రెండ్స్ సలహాలు ఇవ్వడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 21 ఏళ్ల వయసులోనే చెన్నై వెళ్లిన ఆమె.. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసింది. కానీ ఆమెకు సాయం చేసేవాళ్లకంటే ఎక్కువగా మోసం చేసే వాళ్లే తగిలారు. పలువురి చేతిలో మోసపోయింది. సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత వ్యభిచారం చేస్తూ చెన్నైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల తిరుమలకు వచ్చింది. దీంతో ఆమె ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Bhuvaneswari

Bhuvaneswari

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.