143 Movie: 143 సినిమా హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందంటే..

|

Aug 29, 2023 | 10:08 AM

అందం, అభినయంతో బిగ్ స్క్రీన్ పై మెరిసి.. అంతలోనే ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఒకటి, రెండు చిత్రాలతో తమకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఇప్పటికీ అడియన్స్ మదిలో నిలిచిపోయారు. అలాంటి వారిలో హీరోయిన్ సమీక్ష. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. డైనమిక్ అండ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 143 మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది సమీక్ష.

143 Movie: 143 సినిమా హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందంటే..
143 Movie Telugu
Follow us on

వెండితెరపై ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా అలరించి.. తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. అందం, అభినయంతో బిగ్ స్క్రీన్ పై మెరిసి.. అంతలోనే ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఒకటి, రెండు చిత్రాలతో తమకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఇప్పటికీ అడియన్స్ మదిలో నిలిచిపోయారు. అలాంటి వారిలో హీరోయిన్ సమీక్ష. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. డైనమిక్ అండ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 143 మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది సమీక్ష.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయిరాం సరసన సమీక్ష కథానాయికగా నటించింది. ఇందులో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది సమీక్ష. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది మాత్రం ఈ ముద్దుగుమ్మ అనే చెప్పుకోవాలి. 143 మూవీ తర్వాత తెలుగులో సమీక్షకు వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ మూవీ తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన దడ సినిమాలో మెరిసింది. ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో సమీక్షకు కలిసి రాలేదు. దీంతో ఆమెకు చిన్న సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

బ్రహ్మానందం డ్రామా కంపెనీ, కులుమానాలి, ఇదండీ సంగతి సినిమాలతోపాటు తెలుగులో పలు చిత్రాల్లో సందడి చేసింది. అయినప్పటికీ సమీక్షకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఈ బ్యూటీ పంజాబీ, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సందడి చేసింది సమీక్ష. ఈ అమ్మడు 2020లో సింగపూర్ కు చెందిన ప్రముఖ సింగర్ షేల్ ఓస్వాల్ ను వివాహం చేసుకున్నారు. భర్తతో కలిసి కొన్ని సినిమాలు నిర్మించడమే కాదు.. ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేసింది.

ఇక కొద్ది కాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమీక్ష సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా సమీక్షకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతుండడంతో తెలుగు అడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. 143 సినిమా హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.