సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కజిన్స్ ఉన్నారు. స్టార్ కిడ్స్ చాలా మంది సినిమాల్లో రాణిస్తున్నారు. కొంతమంది నటీనటులు రిలేటివ్స్ అవుతారని చాలా మందికి తెలియదు. అలాగే ఇప్పుడు ఓ విలన్ సిస్టర్స్ గురించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ నటించిన సాహో సినిమా గుర్తుందా. ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన స్టైలిష్ నటుడు గుర్తున్నాడా.? సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్ లో మాత్రం ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో కంటే హిందీలో ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.
కాగా సాహో సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన నటుడు గుర్తున్నాడా.? అతని పేరు అరుణ్ విజయ్. తమిళ్ లో హీరోగా, విలన్ గా సినిమాలు చేసి మెప్పించాడు అరుణ్ విజయ్. అజిత్ నటించిన ఎంతవాడుగాని సినిమాలో విలన్ గా తన నటనతో మెప్పించాడు. కాగా అరుణ్ విజయ్ సిస్టర్స్ టాలీవుడ్ లో హీరోయిన్స్ గా చేశారు అని మీకు తెలుసా.? ఆ హీరోయిన్స్ మరెవరో కాదు. అరుణ్ విజయ్ సిస్టర్స్ పేరులు ప్రీతా విజయ్ , శ్రీదేవి విజయ్.
ఈ ఇద్దరు భామలు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.ప్రీతా విజయ్ రుక్మిణి అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే శ్రీదేవి విజయ్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మీ, రవితేజ వీర వంటి సినిమాల్లో చేసింది. ఇప్పుడు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఈ ఇద్దరు భామలు అరుణ్ విజయ్ కు చెల్లెల్లు అవుతారు. అంతే కాదు వీరి తండ్రి విజయ్ కుమార్ కూడా ప్రముఖ నటుడే.. ఎన్నో తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించారు విజయ్ కుమార్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి