Meheshwari: ‘పెళ్లి’ సినిమా హీరోయిన్ మహేశ్వరి ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?.. శ్రీదేవితో ఉన్న బంధం ఏంటంటే..

'ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో'.. అని పాట వినగానే అందరి మదిలో మెరిసే అందాల తార మహేశ్వరి. 1995లో అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరియమైంది. ఆ తర్వాత జెడీ చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో మరోసారి కనిపించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో మహేశ్వరికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. అప్పట్లో ఆమె నటనకు.. మాటలకు యూత్ లో యమ ఫాలోయింగ్ ఉండేది.

Meheshwari: పెళ్లి సినిమా హీరోయిన్ మహేశ్వరి ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?.. శ్రీదేవితో ఉన్న బంధం ఏంటంటే..
Maheshwari

Edited By: Ravi Kiran

Updated on: Jan 26, 2024 | 12:00 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయినవారి గురించి అసలు చెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఎన్నో చిత్రాల్లో నటించి ఓ వెలుగు వెలిగారు. కానీ పెళ్లి తర్వాత అటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అందులో మహేశ్వరి ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ ‘పెళ్లి’, ‘గులాబీ’ సినిమాల పేరు చెబితే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’.. అని పాట వినగానే అందరి మదిలో మెరిసే అందాల తార మహేశ్వరి. 1995లో అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరియమైంది. ఆ తర్వాత జెడీ చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో మరోసారి కనిపించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో మహేశ్వరికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. అప్పట్లో ఆమె నటనకు.. మాటలకు యూత్ లో యమ ఫాలోయింగ్ ఉండేది.

తెలుగులో దెయ్యం, మృగం, జాబిలమ్మ పెళ్లి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఆ తర్వాత వడ్డే నవీన్ నటించిన పెళ్లి సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది మహేశ్వరి. ప్రియరాగాలు, వీరుడు, నవ్వులాట, నీకోసం సినిమాల్లో కనిపించనుంది. 2003 నుంచి 2014లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. మహేశ్వరి చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాల నుంచి దూరమయ్యింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది.

దివంగత హీరోయిన్ శ్రీదేవి మహేశ్వరికి పిన్ని అవుతుంది. అప్పట్లో మహేశ్వరికి పొగరు అనుకునేవారట. శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా..అందుకే ఆమెకు పొగరు అనేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో కలిసి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరుని సందర్శించింది. ఇప్పుడు ఆమెను చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.