Panjaa Movie: హాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ ‘పంజా’ హీరోయిన్.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్

మాజీ మిస్ ఇండియా అయిన ఈ బ్యూటీ పంజా సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఇందులో పవన్ ప్రియురాలిగా సంధ్య పాత్రలో ఆకట్టుకుంది. ఈ మూవీలో చాలా ట్రెడిషినల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ గా హాట్ గా మారిపోయింది.

Panjaa Movie: హాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పంజా హీరోయిన్.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
Panjaa Movie

Updated on: May 15, 2025 | 3:39 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో పంజా ఒకటి. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ పవన్ అభిమానులకు మాత్రం ఈ మూవీ తెగ నచ్చేసింది. ముఖ్యంగా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా పవన్ ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇప్పటికీ టీవీల్లో వస్తే ఈ సినిమాను చాలా మంది చూస్తుంటారు. కోలీవుడ్ దర్శకుడు విష్ణు వర్ధన్ తెరకెక్కించిన పంజా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు ట్రెండీ లుక్ లో కనిపించిన అంజలి లవానియా కాగా మరొకరు ట్రెడిషినల్ లుక్ లో ఆకట్టుకున్న సారా జేన్ డయస్. అంజలి పాత్ర ఫస్టాఫ్ లోనే ముగుస్తుంది.. కానీ సినిమా మొత్తం సారా రోల్ ఉంటుంది. ఇందులో ఆమె క్యూట్ లుక్స్, యాక్టింగ్ ఆడియెన్స్ ను మెప్పించాయి. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ మూవీ తర్వాత సారాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ్, హిందీ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది. విశాల్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు.

కాగా హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించింది సారా. షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ హ్యాపీ న్యూ ఇయర్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. ఈ మధ్యన వైస్రాయ్ హౌస్, ది బకింగ్ హమ్ మర్డర్స్ వంటి ఇంగ్లిష్ సినిమాల్లోనూ ప్రధాన పాత్రలు పోషించింది. అలాగే హిందీలో తాండవ్, మేడ్ ఇన్ హెవెన్, ది ఫ్రీలాన్సర్ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీసుల్లో నటించింది సారా. ఇప్పుడు కంఖజురా అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

సారా జేన్ డయాస్ లేటెస్ట్ ఫొటోస్..

Sarah Jane Dias

సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది సార్. నిత్యం తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. కాగా ఈ అమ్మడి వయసు సుమారు 42 సంవత్సరాలు అయినా ఈ బ్యూటీ ఇంకా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది.

కంకజూర వెబ్ సిరీస్ లో సారా జేన్ డయాస్..


మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .