మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌లో పసివాడి ప్రాణం ఒకటి. చిరంజీవి ఫేవరెట్ డైరెక్టర్ కొండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో మాటలు రాని చిన్నారిగా నటించి ఆకట్టుకుంది సుజిత. ప్రస్తుతం ఆమె టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే మూవీలో మాటలు రాని చిన్నారిని అపహరించే కిడ్నాపర్ పాత్రలో అందరినీ భయపెట్టాడు ఓ క్రూరమైన విలన్. మెగాస్టార్ చిరంజీవితో పోటాపోటీగా ఫైట్లు చేసిన ఆ విలన్ పేరు బాబు ఆంటోని. తెలుగుతో పాటు మిళ్, మలయాళం, హిందీ, కన్నడ.. ఇలా పలు భాషల్లో విలన్‌గా నటించాడు ఆంటోని. తెలుగులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కనిపించాడు. త్రినేత్రుడు, జేబుదొంగ, అడవిలో అభిమన్యుడు, లారీ డ్రైవర్, శత్రువు, చైతన్య, శాంతిక్రాంతి తదితర హిట్ సినిమాల్లో విలనిజం పండించాడు. కండలు తిరిగిన దేహంతో కనిపంచే ఆంథోని అన్ని భాషల్లో కలిపి సుమారు 175కు పైగా సినిమాల్లో నటించాడు.
ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగులో ఆంథోని కనిపించడం లేదు. అయితే తాజాగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో రాష్ట్రకూటుల రాజుగా ఆంథోని కనిపించాడు. కాగా మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడైన ఆయన స్వయంగా తన పేరు మీదనే మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ స్కూల్స్ స్థాపించాడు. దేశంలో పలు నగరాల్లో ఈ స్కూల్ ట్రాంచ్‌లు ఉన్నాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. బాబు రష్యన్ అమెరికన్ మహిళ ఇవగెనియాను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఆర్థర్ ఆంటోనీ, ఆలెక్స్ అంటోనీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.