నితిన్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘ధైర్యం’ చిత్రం మీకు గుర్తుందా.? వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ మూవీ 2005లో విడుదల కాగా.. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ రైమాసేన్. ఆమెకిదే తొలి తెలుగు చిత్రం. అందం, అభినయంతో అచ్చం తెలుగమ్మాయ్‌లా ప్రేక్షకులను అలరించింది ఆ భామ. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో.. అదేమీ జరగలేదు. ‘ధైర్యం’ మూవీ తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ కనిపించలేదు రైమాసేన్. తెలుగులో అవకాశాలు దక్కకపోయినా.. ఈ బ్యూటీ మాత్రం హిందీ, బెంగాళీ భాషల్లో మాత్రం వరుసగా సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంది.
‘గాడ్ మదర్’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బెంగాళీలోనూ వరుస చిత్రాల్లో నటించింది. అడపాడపా మలయాళ, మరాఠీ చిత్రాల్లో కనిపించింది ఈ భామ. ఆ మధ్యన ఒడిశాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కలికేష్ నారాయణ్ సింగ్‌తో ఈమె ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీరి మధ్య రిలేషన్ ఎక్కువకాలం కొనసాగలేదు. ఇటీవల హిందీలో ‘బస్టర్: ది నక్సల్ స్టొరీ’, ‘అలియా బసు గాయబ్ హై’ అనే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ.
గత కొంతకాలంలో వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉంది రైమాసేన్. ‘ఫోర్బిడెన్ లవ్’, ‘ది లాస్ట్ హౌర్’, ‘మై: ఏ మదర్ రేజ్’, ‘రోక్తోకోరోబి’, ‘కోలోంకో’ లాంటి వెబ్ సిరీస్‌లు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉండే రైమాసేన్ నిత్యం ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇస్తోంది.
ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి