
మాస్ వంటి సూపర్ హిట్ తర్వాత నాగార్జున- రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా డాన్. గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీలో నాగ్ తో పాటు రాఘవ లారెన్స్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. హీరోయిన్ గా స్వీటీ అనుష్క కనిపించింది. 2007 రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా నాగ్- విలన్ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక డాన్ మూవీలో హీరోకు పోటీగా నటించిన విలన్ స్టీఫెన్ రోల్ బాగా క్లిక్ అయ్యింది. సినిమాలో హీరోతో పాటు విలన్ కు కూడా ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్. అలాగే ఎలివేషన్స్ కూడా బాగా ఇచ్చాడు. దీంతో అసలు అప్పటి వరకు టాలీవుడ్ స్క్రీన్‌పై ఆ రేంజ్ స్టైలిష్ విలన్‌ను చూడలేదనన్న కాంప్లిమెంట్స్ వినిపించాయి. అలా స్టీఫెన్ రోల్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసిన ఆ నటుడి పేరు కెల్లీ డోర్జీ. భూటాన్ కు చెందిన ఆయనకు తెలుగులో ఫస్డ్ మూవీ ఇదే కావడం గమనార్హం.
డాన్ కంటే ముందు కొన్ని తెలుగు సినిమాల్లో నటించాడు కెల్లీ దోర్జ్. ఇక తెలుగులో ద్రోణ, బిల్లా, కింగ్, కేడి, గోలీమార్, బద్రీనాథ్, రెబెల్, దడ, బాద్షా, వన్.. నేనొక్కడినే, పవర్, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తదితర సినిమాల్లో విలన్ గా నటించాడు కెల్లీ. తెలుగు, హిందీతో పాటు మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సుమారు 30కు పైగా సినిమాలు చేశాడీ నటుడు. అయితే 2014 బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదీ స్టైలిష్ యాక్టర్. ఇక 2015 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు కెల్లీ. సుమారు 9 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ నటుడు 2024 లో బ్లాక్ అవుట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక గతేడాది కూడా ఢిల్లీ క్రైమ్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు.
కెల్లీ దోర్జ్ లేటెస్ట్ ఫొటోస్
కాగా కెల్లీ ప్రస్తుతం భూటాన్ లోనే నివాసముంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలు బాగా తగ్గించేసిన ఆయన అక్కడే ఓ లగ్జరీ ట్రావెల్ కంపెనీని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెల్లీకి సంబంధించిన ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతన్నారు. ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికీ చాలా మారిపోయాడీ నటుడు. అప్పటికంటే చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు కెల్లీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.