Megastar Chiranjeevi: ‘పసివాడి ప్రాణం’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా ? .. చిరు ఎత్తుకున్న చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడంటే..

|

Mar 15, 2023 | 10:41 AM

ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించింది అబ్బాయి కాదు.. అమ్మాయి. ఆమె మనందరికి సుపరిచితమే. తను మరెవరో కాదు.. సీరియల్ నటి సుజిత.

Megastar Chiranjeevi: పసివాడి ప్రాణం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా ? .. చిరు ఎత్తుకున్న చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడంటే..
Pasivaadi Pranam
Follow us on

మెగాస్టార్ చిరంజీవి కెరియర్‏లో అత్యంత ఘన విజయాలను అందుకున్న చిత్రాల్లో పసివాడి ప్రాణం ఒకటి. డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరుతోపాటు.. విజయశాంతి, సుమలత ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించగా.. కె.చక్రవర్తి సంగీతం అందించారు. 1987లో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఓ మాట్లాడలేని…వినపడని ఓ పిల్లాడి కథ. తల్లిదండ్రుల హత్యను కళ్లారా చూసిన ఆ పిల్లాడిని చంపేందుకు విలన్స్ ప్రయత్నించడం.. అనుకోకుండా చిరు చెంతకు చేరడం.. ఆ తర్వాత చిరంజీవి జీవితంలో ఎదురైన సంఘటనలే పసివాడి ప్రాణం చిత్రం. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించింది అబ్బాయి కాదు.. అమ్మాయి. ఆమె మనందరికి సుపరిచితమే. తను మరెవరో కాదు.. సీరియల్ నటి సుజిత.

ఈ సినిమాతో బాలనటిగా ప్రశంసలు అందుకుంది సుజిత. కేవలం ఈ ఒక్క సినిమాలో కాదు.. ఏకంగా ఐదు భాషల్లో బాలనటిగా నటించి మెప్పించింది సుజిత. తెలుగులో చిరుతోపాటు.. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించింది సుజీత. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన జై చిరంజీవ చిత్రంలో చిరు చెల్లిగా కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల కొద్ది రోజుల క్రితం తెలుగులో వదినమ్మ సీరియల్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించింది సుజిత. 1983 జూలై 12న జన్మించిన సుజిత.. తెలుగుతోపాటు.. మలయాళం, తమిళం, తెలుగు సీరియళ్లలో నటించింది. ధనుష్ అనే యాడ్ డిజైనర్ ను వివాహం చేసుకున్నారు సుజిత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.