Pooja Gandhi: దండుపాళ్యం హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటి ఇంత అందంగా మారిపోయింది.. స్టన్ అవుతారంతే

|

Oct 06, 2024 | 5:47 PM

2012లో వచ్చిన దండుపాళ్యం సినిమాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు శ్రీనివాస్ రాజు ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. మొదట కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఆ తర్వాత తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది.

Pooja Gandhi: దండుపాళ్యం హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటి ఇంత అందంగా మారిపోయింది.. స్టన్ అవుతారంతే
Actress Pooja Gandhi
Follow us on

2012లో వచ్చిన దండుపాళ్యం సినిమాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు శ్రీనివాస్ రాజు ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. మొదట కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఆ తర్వాత తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దండుపాళ్యం మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత కూడా ఈ ఫ్రాంచైజీలో సినిమాలు వచ్చాయి. ఇప్పటివరకు దండు పాళ్యం సిరీస్ లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. కాగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో పూజా గాంధీ,రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, పి. రవిశంకర్, రఘు ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా కన్నడ నటి పూజా గాంధీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. బోల్డ్ గా నటించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే క్రూరంగా హత్యలు చేస్తూ ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది. పూజా గాంధీ ఎక్కువగా కన్నడ సినిమాల్లోనే నటించింది. అలాగే తమిళ్, తెలుగు భాషల్లోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా దండు పాళ్యం సినిమాతోనే బాగా క్రేజ్ తెచ్చుకుందీ అందాల తార.

కాగా తన పదేళ్ల సినిమా కెరీర్ లో సుమారు 50 సినిమాల్లో నటించింది పూజా గాంధీ. అయితే 2021 తర్వాత ఈ అందాల తార పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. ఆమె చివరిగా దండుపాళ్యం 3 సినిమాలో కనిపించింది. ఇక గతేడాది నవంబర్ లో ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ ఘోర్పడేను పెళ్లి చేసుకుంది పూజా గాంధీ. సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన రెగ్యులర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. దండుపాళ్యం సినిమాలో మొరటుగా, బోల్డ్ గా కనిపించిన పూజా గాంధీ నిజ జీవితంలో మాత్రం ఎంతో అందంగా, హుందాగా కనిపిస్తుంటుంది. అలా తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ అసలు ఈమె దండుడుపాళ్యం పూజా గాంధీనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

పూజా గాంధీ లేటెస్ట్ ఫొటోస్..

పూజా గాంధీ గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.