Folk Singer : అప్పట్లో సెన్సేషన్.. అనితా ఓ అనితా సింగర్ ఇప్పుడు ఎలా మారిపోయాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్ గుర్తుందా. ? అదేనండీ.. అనితా ఓ అనితా సాంగ్. ఈ పాట క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అప్పట్లో కుర్రాళ్లు ఈ పాటకు పిచ్చెక్కిపోయారు. ముఖ్యంగా 90's యూత్ కు ఈ పాట ఫేవరేట్ అనే చెప్పాలి. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ సాంగ్ దూసుకుపోతుంది.

Folk Singer : అప్పట్లో సెన్సేషన్.. అనితా ఓ అనితా సింగర్ ఇప్పుడు ఎలా మారిపోయాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Anitha O Anitha Song

Updated on: May 31, 2026 | 2:10 PM

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. కానీ ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతను, ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ బాధితులను ఉర్రూతలూగించిన పాట ‘అనితా.. ఓ అనిత’. యూట్యూబ్, సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఈ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ప్రతీ ఒక్కరి ఫోన్ రింగ్‌టోన్‌గా, కాలర్ ట్యూన్‌గా ఈ పాట మారుమోగిపోయేది. ఈ పాట కేవలం ఒక ఆల్బమ్ సాంగ్ మాత్రమే కాదు, ఎంతోమంది ప్రేమికుల వ్యథకు నిలువుటద్దంలా నిలిచింది. ఈ పాట వెనుక ఉన్న కథ కూడా ఎంతో విషాదకరమైనది. ఈ పాటను రాసి, పాడింది నాగరాజు అనే వ్యక్తి. తాను ప్రాణంగా ప్రేమించిన ‘అనిత’ కుటుంబ సభ్యుల అంగీకారం లేక దూరమవ్వడంతో, ఆ విరహ వేదనను భరించలేక, తన మనసులోని బాధను పాట రూపంలోకి మార్చారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

నెల రోజుల పాటు కష్టపడి రాసిన ఈ పాట, విడుదలైన తర్వాత సంచలనం సృష్టించింది. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన చేదు నిజాలే పాటగా మారడంతో, అది ప్రజలకు అంతలా కనెక్ట్ అయ్యింది. అయితే, ఈ పాట తర్వాత నాగరాజు జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ఒకానొక దశలో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం పాన్ షాప్ కూడా పెట్టుకున్నారంటే ఆయన పడిన కష్టాలు అర్థం చేసుకోవచ్చు. కానీ, తనపై తనకున్న నమ్మకంతో మళ్లీ కళా ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ప్రస్తుతం నాగరాజు మళ్లీ తన గాత్రంతో అలరిస్తున్నారు. ‘అనిత 2’ పేరుతో ఆయన విడుదల చేసిన పాట యూట్యూబ్‌లో కోటి వ్యూస్‌ను సాధించి మరోసారి తన సత్తా చాటింది. ఆ తర్వాత ‘కమలమ్మ’, ‘మా లచ్చమ్మ గుడికాడ’ వంటి జానపద , ప్రేమ పాటలతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాగరాజు ఫోక్ సాంగ్స్ పాడుతూ, తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఒడిదుడుకులను దాటుకుని, తన కళను నమ్ముకుని ముందుకు సాగుతున్న నాగరాజు ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

అనితా సాంగ్..

సింగర్ నాగరాజు..

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us