Tollywood : తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ప్రేమకథలతోనే హిట్లు.. సినిమాలు వదిలేసి చర్చిలో పాస్టర్‏గా మారిన హీరో..

సినిమా రంగుల ప్రపంచంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. తక్కువ సమయంలోనే క్రేజీ హీరోగా సక్సెస్ అయిన హీరోలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు హీరోలు ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుండగా.. మరికొందరు మాత్రం సినిమాలు చేయడం మానేశారు.

Tollywood : తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ప్రేమకథలతోనే హిట్లు.. సినిమాలు వదిలేసి చర్చిలో పాస్టర్‏గా మారిన హీరో..
Raja

Updated on: Dec 27, 2025 | 2:12 PM

దాదాపు రెండు దశాబ్దాల క్రితం సినీరంగంలో అత్యధిక క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో. తక్కువ సమంయలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చూడటానికి కూల్ గా ఉంటాడు. అమ్మాయిల ఫేవరేట్ హీరో అయిన అతడు.. తన నటనతో అడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోగా నటించాడు. ఆ మూవీ అతడి కెరీర్ మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నాడు. కానీ అతడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో పేరు రాజా హెబెల్. దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా, 30 చిత్రాలలో నటించాడు. చివరికి 2013లో, ఓహ్ మై లవ్ చిత్రం తర్వాత, అతను చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. సినిమా పరిశ్రమను వదిలేసిన తర్వాత రాజా చర్చిలో పాస్టర్ గా మారాడు. . ప్రస్తుతం ఆ స్టార్ హీరో ముషీరాబాద్ లోని ది న్యూ కోవనెంట్ చర్చిలో భక్తులకు దైవ ప్రవచనాలు చేస్తున్నారు. అతడి అసలు పేరు కృష్ణమూర్తి.

ఇవి కూడా చదవండి :  The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆనంద్ సినిమాలో హీరోగా నటించాడు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాజాకు మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఈ స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు.

ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..

Raja Abel

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.