Aaruguru Pathivrathalu: ఆరుగురు పతివ్రతలు సినిమా బ్యూటీ గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..
ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీరంగంలో పాపులర్ అయ్యింది. 2004లో విడుదలైన ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఓవైపు ఆమె పాత్రపై విమర్శలు వచ్చినప్పటికీ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనే హీరోయిన్ అమృత. కానీ ఆ తర్వాత మరో చిత్రంలో కనిపించలేదు.
తెలుగు సినీరంగంలోకి చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు. చిన్న సినిమాల్లో నటించినప్పటికీ కొందరు క్లిక్ అయ్యి వరుస ఆఫర్స్ అందుకుంటూ సినిమాల్లో రాణిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారిలో అమృత ఒకరు. ఈ పేరు అసలు టాలీవుడ్ జనాలకు అంతగా పరిచయమే లేదు. కానీ ఆరుగురు పతివ్రతలు సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అప్పట్లో డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈవీవీ. ఇలాంటి సినిమా చేయడం చూసి అడియన్స్ షాకయ్యారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలంగా మారింది. ఇక సినిమాతో ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది హీరోయిన్ అమృత. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈ బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేశారు ఈవీవీ. ఈ చిత్రంలో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆరుగురు పతివ్రతలు 2004లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సంచలనం అయ్యింది.ఈ సినిమాకు సంబంధించిన సీన్లను మీమర్స్ తెగ వాడుతుంటారు. 2004 ఫిబ్రవరి 6న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ఈవీవీ సినిమా బ్యానర్ పై ఈవీవీ సత్యనారాయణ నిర్మించారు. అలాగే దర్శకత్వం వహించారు. ఇందులో చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ కీలకపాత్రలో పోషించగా.. కమలాకర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో అమృత పాత్రపై అప్పట్లో చాలా విమర్శలు కూడా వచ్చాయి.
ఈ సినిమా తర్వాత తెలుగులో కేవలం ఎనిమిది చిత్రాల్లోనే నటించింది. 2009లో ‘జోడి నెంబర్ 1’ సినిమాలో నటించింది. కన్నడలో వచ్చిన ఈ మూవీలోనే ఆమె చివరిసారిగా నటించింది. అమృత కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకున్నారని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపించడం లేదు. దీంతో ఆమె ఎక్కడ ఉన్నారని గూగుల్ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.