# 90’s Web Series: #90’s వెబ్ సిరీస్లో నటించిన అమ్మాయి గుర్తుందా ..? ఈ రేంజ్లో మేకోవర్ అస్సలు ఊహించలేరు..
కొత్త దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన ఈ సిరీస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తోపాటు.. కామెడీ కూడా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబకథా ప్రేమికులకు ఈ సిరీస్ తెగ నచ్చేసింది. చిన్నారులు, యూత్, పెద్దవారు అంతా ఈ సిరీస్ ఎంజాయ్ చేశారు. ఇందులో మౌళి, వాసంతిక, రోషన్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. వీరి ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి.

ఇటీవల ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ #90’s మిడిల్ క్లాస్ బయోపిక్. హీరో శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. 90’sలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పరిస్థితులు ఎలా ఉండేవి..? అప్పట్లో యూత్ ఎలా జీవించేవారు.. ? చదువులు ఎలా ఉండేవి? అనేవి ఈ సిరీస్ లో చూపించారు. ఇందులో శివాజీతోపాటు.. వాసుకి ప్రధాన పాత్రలో నటించారు. కొత్త దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన ఈ సిరీస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తోపాటు.. కామెడీ కూడా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబకథా ప్రేమికులకు ఈ సిరీస్ తెగ నచ్చేసింది. చిన్నారులు, యూత్, పెద్దవారు అంతా ఈ సిరీస్ ఎంజాయ్ చేశారు. ఇందులో మౌళి, వాసంతిక, రోషన్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. వీరి ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి.
ఇక ఇందులో శివాజీ కూతురిగా వాసంతిక నటించింది. సహజమైన నటనతో పక్కింటి అమ్మాయిలా కనిపించింది. ఈ సిరీస్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సిరీస్ కంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ స్టార్ హీరో సినిమాలో నటించింది వాసంతిక. అదే కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఇందులో చుట్కీ పాత్రలో అలరించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది మెప్పించిచంది. కానీ #90 వెబ్ సిరీస్ ద్వారా ఇప్పుడు తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది.
వాసంతిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సినిమా అప్డేట్స్, ఫోటోస్, రీల్స్ చేస్తూ సందడి చేస్తుంది. ప్రస్తుతం వాసంతికకు ఇన్ స్టాలో 211కే ఫాలోవర్స్ ఉన్నారు. ఓవైపు చదువుంటునే మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అలాగే వాసంతిక క్లాసికల్ డ్యాన్సర్. నటిగానే కాకుండా డాన్స్ కూడా ఇరగదీస్తుంది.

Vasanthikaమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




