అయ్యబాబోయ్.! ప్రయాణం మూవీ హీరోయిన్ ఏంటి.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..

|

May 23, 2024 | 10:09 PM

ఈ చిన్నది తెలుగులో మంచువారబ్బాయ్ సరసన తొలి చిత్రం చేసింది. అయితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఓ సినిమా ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అసలే స్టార్ హీరో.. ఆపై హిట్ సినిమా.. కచ్చితంగా ఈ హీరోయిన్‌కు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు..

అయ్యబాబోయ్.! ప్రయాణం మూవీ హీరోయిన్ ఏంటి.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
Actress
Follow us on

ఈ చిన్నది తెలుగులో మంచువారబ్బాయ్ సరసన తొలి చిత్రం చేసింది. అయితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఓ సినిమా ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అసలే స్టార్ హీరో.. ఆపై హిట్ సినిమా.. కచ్చితంగా ఈ హీరోయిన్‌కు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. తెలుగులో కేవలం ఒక్క తెలుగు చిత్రంలోనే నటించి.. ఆ తర్వాత కనుమరుగైంది ఈ భామ. ఆమె మరెవరో కాదు.. పాయల్ ఘోష్. 2009లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ సంవత్సరం సైలెంట్‌గా వచ్చి.. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈమె పేరు ఊసరవెల్లి సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. తమన్నా ఫ్రెండ్ చిత్ర పాత్రలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత పాయల్ ఘోష్‌కు వరుసగా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే ఆమెకు మరే అవకాశాలు రాలేదు. కన్నడంలో ఒక్క చిత్రం చేసిన పాయల్ ఘోష్.. మిస్టర్ రాస్కెల్ మూవీ తర్వాత ఆమె కనిపించలేదు.

హిందీలో పటేల్ కి పంజాబీ షాదీ, కోయి జానే నా, ఫైర్ ఆఫ్ లవ్ : రెడ్ వంటి చిత్రాల్లో నటించింది పాయల్ ఘోష్. అలాగే హిందీలో ఒక సీరియల్ కూడా నటించింది ఈ భామ. కాగా, ఆ తర్వాత సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్న ఈ బ్యూటీ.. 2020లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇక అదే ఏడాది అక్టోబర్‌లో రాంధాస్ అథవాలే చెందిన రాజకీయ పార్టీలోకి చేరింది. వెంటనే మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమితులైంది పాయల్ ఘోష్.