AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: బాబోయ్.. ప్రభాస్ బుజ్జి చాలా స్పెషల్.. కారు ఫీచర్స్ తెలిస్తే షాకవుతారు..

ఈ సినిమాలో డార్లింగ్ డిఫరెంట్ లుక్‏లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా కల్కి చిత్రంలో భైరవ జీవితంలో అత్యంత స్పెషల్ అయిన బుజ్జి (కారు)ను అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకు భారీ ఈవెంట్ నిర్వహించగా.. స్వయంగా బుజ్జిని డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు. సరికొత్తగా కనిపిస్తున్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్.

Kalki 2898 AD: బాబోయ్.. ప్రభాస్ బుజ్జి చాలా స్పెషల్.. కారు ఫీచర్స్ తెలిస్తే షాకవుతారు..
Prabhas Bujji
Rajitha Chanti
|

Updated on: May 24, 2024 | 7:00 AM

Share

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీ పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాలో డార్లింగ్ డిఫరెంట్ లుక్‏లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా కల్కి చిత్రంలో భైరవ జీవితంలో అత్యంత స్పెషల్ అయిన బుజ్జి (కారు)ను అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకు భారీ ఈవెంట్ నిర్వహించగా.. స్వయంగా బుజ్జిని డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు. సరికొత్తగా కనిపిస్తున్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్.

డిఫరెంట్ లుక్‏లో కొత్తగా కనిపిస్తున్న బుజ్జి గురించి ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. బుజ్జిని ఎలా తయారు చేశారు ? ఎవరు.. ఎక్కడ రెడీ చేశారు.. ? ఎంత ఖర్చు అయ్యింది…? అసలు ఫీచర్స్ ఏంటీ ..? అనే విషయాలు తెలుసుకోవడానికి అడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు బుజ్జి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ ఓ స్పెషల్ వీడియో నెట్టింట వైరలవుతుంది. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మహీంద్రా, జాయోమ్ ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించాయి. దాదాపు ఆరు టన్నుల బరువు ఉన్న ఈ బుజ్జిని తమిళనాడులోని కోయంబత్తూర్ లో తయారు చేశారు. ఈ కారు కోసం రూ.7 కోట్లు వెచ్చించారట. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే ఉన్న ఈ బుజ్జి కారు అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.

ఈ టైర్ పొడవు -6075 మిమీ, వెడల్పు -3380 మిమీ, ఇక ఎత్తు -2186 మిమీ. రిమ్ సైజ్ -34.5 ఇంచెస్. ఈ కారు పవర్ 94Kw, బ్యాటరీ 47KWH. ఈ స్పెషల్ కారును కల్కి సినిమాలో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రెడీ చేయడం కోసం ఇంజనీర్లు ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన బుజ్జి స్పెషల్ వీడియో ఆకట్టుకుంది. ఇందులో బుజ్జి కారుకు హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికీ భారీ హైప్ నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?