OTT Web series: బాబోయ్ రాత్రి పూట చూడొద్దు.. సింగిల్‌గా చూస్తే సుస్సు పోసుకుంటారు..

భయపడుతూ కూడా హారర్ థ్రిల్లర్ సినిమాలు/ వెబ్ సిరీస్‌లు చూస్తారు కొందరు. వారికి అవి అంటే ఇష్టం. అయితే కొన్ని సినిమాలు అమాంతం గుండె దడని పెంచుతాయి. అంతేకాదు చూసిన తర్వాత కూడా ఆ సీన్స్ వెంటాడుతుంటాయి. అలాంటి కోవకే చెందినది ఈ సిరీస్...

OTT Web series: బాబోయ్ రాత్రి పూట చూడొద్దు.. సింగిల్‌గా చూస్తే సుస్సు పోసుకుంటారు..
Betaal Web Series

Updated on: Oct 12, 2025 | 1:35 PM

ప్రజలకు ఓటీటీ మాంచి కిక్ ఇచ్చే కంటెంట్ అందిస్తున్నాయి. వరల్డ్ సినిమా అంతా మొబైల్‌లోకి వచ్చేసింది. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు జనాల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకనిర్మాతలు అలాంటి కంటెంట్ అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే ఎన్నో భయానక హారర్-థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు రకరకాల ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇప్పుడు మేం చెప్పబోయే సిరీస్ కూడా ఆ కోవకు చెందినదే. ఈ సిరీస్‌లో కేవలం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. స్టోరీ లైన్ చూస్తే.. గవర్నమెంట్ ఓ మారుమూల గ్రామానికి ఓ ప్రాజెక్ట్ కేటాయిస్తుంది. దీంతో అధికారులు అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తారు. గ్రామం పక్కన సొరంగం తవ్వడానికి అధికారులు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకుంటారు. అందుకు ఓ రీజన్ ఉంటుంది. గ్రామస్తులు వెనక్కి తగ్గకపోవడంతో.. ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించుతుంది. అయితే గ్రామస్తులను బలవంతంగా ఖాళీ చేయించడానికి ఆర్మీ కమాండర్ ఒక అవినీతి వ్యాపారవేత్తతో కలిసి కుట్ర పన్నుతాడు.

ఆపై అధికారులు, పోలీసులు కలిసి సొరంగం తవ్వకాలు చేపడతారు. ఈ క్రమంలో భయానక దెయ్యాలు బయటికి వచ్చి వారిపై దాడి చేస్తాయి. వాటి దాడి తాలూకా దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అంతేకాదు ఆ దయ్యాలు బ్రిటిష్ వేషధారణతో.. ముఖం నిండా రక్తపు చారలతో చూస్తేనే మీరు గగుర్పాటుకు గురవుతారు. మరి చివరకు ఏమైందో తెలియాలంటే సిరీస్ మొత్తం చూడాల్సిందే.

‘బేటల్’ అనే పేరుతో రిలీజైన్ ఈ సిరస్‌లో వినీత్ కుమార్ సింగ్ మెయిన్ లీడ్ పోషించారు. అహనా కుమార్‌ది మరో కీలక పాత్ర. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.