AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ షేర్ చేసిన ఈ ఫోటో ఎవరిదో తెలుసా..?

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మైథలాజికల్ మూవీలో సీతగా బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తున్నారు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. గతంలో మహేష్ బాబు , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది.

Kriti Sanon: ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ షేర్ చేసిన ఈ ఫోటో ఎవరిదో తెలుసా..?
Kriti Sanon
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2023 | 9:05 AM

Share

ఇప్పుడు దేశమంతా ఆదిపురుష్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మైథలాజికల్ మూవీలో సీతగా బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తున్నారు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. గతంలో మహేష్ బాబు , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తో కలిసి దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుంది ఈ భామ.

బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ భామ. ఇక ఇప్పుడు ఆదిపురుష్ తో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిపురుష్ సినిమానుంచి కృతిసనన్ లుక్ రిలీజ్ అయినా దగ్గర నుంచి ఈ అమ్మడి పై ప్రశంసలు పురిపిస్తున్నారు. సీత పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఈ చిన్నది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా విషయాల గురించి. వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ భామ. తాజాగా కృతి షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృతి సనన్ తన తల్లి ఫోటోను షేర్ చేసింది. కృతి సనన్ షేర్ చేసిన ఈ ఫోటోలో ఒకవైపు ఆమె సీతమ్మ పాత్రలో ఉన్న ఫోటోని, మరొకటి  అచ్చం అదే గెటప్ లో తన తల్లి గీతా సనన్ పాత ఫోటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..