AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్, పవన్, ఎన్టీఆర్‌లతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనుంచి బ్యాన్.. ఇప్పుడు ఇలా

ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ. అంతే కాదు టాలీవుడ్ ను ఒకానొక సమయంలో ఏలింది ఆమె.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్‌లో ఎన్నో హైట్స్ చూసింది.

మహేష్, పవన్, ఎన్టీఆర్‌లతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనుంచి బ్యాన్.. ఇప్పుడు ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: May 12, 2026 | 11:07 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆమె అగ్ర తార.. కుర్రాళ్ళ కలల రాకుమారి. ఆమె కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒకానొకసమయంలో ఏ సినిమాలో చూసినా ఆమె హీరోయిన్ గా కనిపించేది. స్టార్ హీరోయిన్ గా రాణించాల్సిన సమయంలో ఊహించని షాక్.. దెబ్బకు ఇండస్ట్రీ ఆమెను నిషేదించింది. అంతే కాదు రెండు సార్లు ప్రేమలో పడింది, పెళ్లికాకుండానే తల్లి అయ్యింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. కానీ బ్యాడ్ లక్ వెంటాడటంతో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆ అందాల భామ ఎందుకు బ్యాన్ అయ్యిందో తెలుసా.? ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకొని ఆతర్వాత కెరీర్ లో తడబడ్డ ఆ హీరోయిన్ మరెవరో కాదు..

ఇది కూడా చదవండి : దట్ ఈజ్ పవర్ స్టార్..! ఆ రోజు పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..

ఒకప్పుడు కుర్రాళ్ళ ఆరాధ్య దేవత ఇలియానా.. తెలుగులో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఇలియానా..  తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళం, హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. 2006లో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘దేవదాసు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా హీరోయిన్ గా రాణించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Puri Jagannath: ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్.. ఆయనలేకపోతే నేను లేను

కట్ చేస్తే బాలీవుడ్ లో సినిమాలు చేసింది. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. ఆతర్వాత ఓ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. ఆతర్వాత అతనితో విడిపోయింది. ఆతర్వాత డిప్రషన్ లోకి వెళ్ళింది. ఊహించని విధంగా బరువు పెరిగింది. ఆతర్వాత తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. కానీ సక్సెస్ అందుకోలేకపోయింది. ఆతర్వాత మరొకరితో ప్రేమలో పడింది. ఇక ఇప్పుడు పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది.  అయితే తమిళ్ ఇండస్ట్రీ ఈ అమ్మడిని నిషేధం విధించింది. తమిళ్ ఓ సినిమా కోసం రూ. 40లక్షలు అడ్వాన్స్ తీసుకుందట.. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదట.. అంతే కాదు సినిమా కోసం ఆమె ఇచ్చిన డేట్స్ కూడా ఫేక్ అని తేలింది. దాంతో ఛాంబర్ ద్వారా ఇలియానాను అధికారికంగా నిషేధిం విధించారు. కొత్త సినిమా చేయాలంటే రూ. 40లక్షలు కట్టాల్సిందే అని తేల్చి చెప్పింది ఛాంబర్.. చివరిగా ఆమె నటించిన సినిమా విజయ్ నటించిన స్నేహితుడు. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.

ఇది కూడా చదవండి : ఆహా..! ఏం సాంగ్ మావ.. వింటుంటే నరాలు జివ్వుమనాల్సిందే.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న రొమాంటిక్ సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us