
తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిరుపేద, ధనిక వ్యత్యాసం చూపిస్తూ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. కుబేర సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. నాగార్జున మరోసారి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల మంచి కథను సిద్దం చేసి తెరకెక్కించారు. థియేటర్స్ లో కుబేర సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.
అలాగే ఓటీటీలోనూ కుబేర సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే కుబేర సినిమాలో ధనుష్, రష్మిక, నాగార్జునతో పాటు మరో ముగ్గురు కూడా కీలక పాత్రలో కనిపించారు. ధనుష్ తో పాటు బిచ్చగాళ్లుగా కనిపించి ఆకట్టుకున్నారు. వారిలో కుష్బూ అనే పాత్రలో నటించిన అమ్మయి అందరి దృష్టి ఆకట్టుకుంది. సినిమా చివరివరకు ఆమె కనిపిస్తుంది. ధనుష్ ఆమెకు సాయం చేసే సన్నివేశాలు థియేటర్స్ లో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి. కాగా కుబేర సినిమాలో కుష్బూ పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా.?
ఆమె పేరు శ్రావణి సాటం. కుబేర సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది శ్రావణి. బిచ్చగత్తె పాత్రలో చక్కగా నటించింది. అలాగే గర్భంతో ఉన్న మహిళగా ఆకట్టుకుంది. కుబేర సినిమా తర్వాత శ్రావణి క్రేజ్ పెరిగిపోయింది. ఆమె బయట ఎలా ఉంటుందో అని నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన స్టాన్నింగ్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.