ఆ స్టార్ హీరోకు కూతురిగా, లవర్‌గా నటించిన హీరోయిన్..! కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆ బ్యూటీ

సినిమా ఇండస్ట్రీ భలే గమ్మత్తుగా ఉంటుంది. చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా నటించడంతో పాటు పాత్రలకు ప్రాణం పోస్తున్నారు. కొంతమంది ఒకే హీరోకి లవర్‌గా, భార్యగా, అమ్మగా నటించాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఒకే హీరోకు లవర్‌గా, అమ్మగా నటించిన వారూ ఉన్నారు.

ఆ స్టార్ హీరోకు కూతురిగా, లవర్‌గా నటించిన హీరోయిన్..! కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆ బ్యూటీ
Actress

Updated on: Dec 18, 2025 | 7:01 PM

సినిమా అనేది ఓ కళ.. సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం కోసం చాలా మంది కష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. మరికొంతమంది ఎంత ట్రై చేసినా కూడా స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోతున్నారు. ఇక కొంతమంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్స్ ఒకే హీరోకు లవర్ గా, భార్యగా, అమ్మగానూ నటిస్తూ అలరిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా.. ఒకే హీరోకు లవర్ గా కూతురిగా నటించింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఆ అమ్మడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సీరియల్స్ ల్లో, సినిమాల్లో నటిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాశి. మమతల కోవెల, రావు గారి ఇల్లు, పల్నాటి పౌరుషం, బాలగోపాలుడు, ఆదిత్య 369 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో బాల నటిగా యాక్ట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ సినిమాల్లోనూ ఛైల్డ్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. 1997లో పెళ్లి పందిరి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన రాశి పలు సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా నటించింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, సముద్రం, కృష్ణబాబు, మూడు ముక్కలాట, ఆమ్మో ఒకటో తారీఖు, దేవుళ్లు, సందడే సందడి తదితర సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్

ఇక మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో నెగెటివ్ రోల్ లోనూ అదరగొట్టిందీ అందాల తార. అయితే రాశి ఓ హీరోకు కూతురిగా నటించింది అలాగే లవర్ గా నటించి ఆ హీరోతో రొమాన్స్ చేసింది. ఆ హీరో ఎవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్. రాజశేఖర్ హీరోగా నటించిన మమతల కోవెల సినిమాలో రాశి నటించింది. కాగా ఈ సినిమాలో రాజశేఖర్ కూతురిగా నటించింది. అలాగే పదేళ్ల తర్వాత రాజశేఖర్‌ హీరోగా వచ్చిన `నేటి గాంధీ` చిత్రంలో రాశి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఆయన లవర్ గా నటించింది రాశి.. ఇలా రాశి రాజశేఖర్ కు కూతురిగా, లవర్ గా నటించింది.

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.