వరుసగా తొమ్మిది ఫ్లాప్స్.. క్రేజ్ మాత్రం పీక్స్.. గ్లామర్ డోస్ పెంచేసిన కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్

అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్ అనేది మాత్రం అందుకోలేకపోతుంది. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఈ మధ్య కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు.

వరుసగా తొమ్మిది ఫ్లాప్స్.. క్రేజ్ మాత్రం పీక్స్.. గ్లామర్ డోస్ పెంచేసిన కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్
Actress

Updated on: Sep 18, 2025 | 11:29 AM

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు చాలా వరకు తక్కువ ఉంటున్నాయి. దాంతో సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రకరకాల ఫోటో షూట్స్, వీడియోలతో అభిమానులను కవ్విస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా మంచి గుర్తుంపు తెచ్చుకుంటుంది ఈ చిన్నది విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ చిన్నది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ నెటిజన్స్‌ను దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంది. పై ఫోటో క్యూట్ లుక్‌లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది.

మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి

గ్లామర్ డోస్ తో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది అనన్య. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

ఆరుగురు పిల్లల తండ్రితో ఎఫైర్.. పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్

వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్య హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. కానీ ఈ అమ్మడికి సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంది అనన్య. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ప్రస్తుతం అనన్య భారీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దొరికితే ఈ అమ్మడు టాలీవుడ్ లో మరింత బిజీగా మారిపోతుంది అంటున్నారు అభిమానులు. ఇక సోషల్ మీడియాలో అనన్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామర్ డోస్ పెంచి కుర్రాళ్లను కవ్విస్తుంది అనన్య. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ కు కిర్రెక్కిస్తున్నాయి.

13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.