
ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతున్నారు. కొంతమంది తమ అందంతో కట్టిపడేస్తుంటే మరికొంతమంది మాత్రం తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాగే కొంతమంది భామలు ఫ్లాప్స్ వచ్చినా కూడా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా మెయింటేన్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ లో చాలా మంది రిచ్ యాక్ట్రెస్ ఉన్నారు మనదగ్గర.. సినిమాతో పాటు బిజినెస్ లు కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు.
మరికొంతమంది మాత్రం వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. ఫస్ట్ సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది. ఆతర్వాత ఓ డబ్బున్న వ్యక్తిని పెళ్ళాడి ఇప్పుడు రిచ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. ఆమె ఎవరంటే..
పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు షర్మిన్ సెగల్. ఈ చిన్నది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి. ఈ ముద్దుగుమ్మ దర్శకుడు మోహన్ సెగల్ మనవరాలు. దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీకి ఈ ముద్దుగుమ్మ మేనకోడలు. ఈ అమ్మడు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు నటిగా మారింది. మలాల్ సినిమాలో నటించి మెప్పించింది. ఆతర్వాత రీసెంట్ గా వచ్చిన హీరామండి: డైమండ్ బజార్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. బిజినెస్ టైకూన్ సమీర్ మెహతా కుమారుడు, ప్రముఖ బిజినెస్‌మ్యాన్ అమన్ మెహతాను 2023 వివాహం చేసుకుంది. సమీర్ మెహతా సంపద రూ.53,800 కోట్లుగా ఉంది. వీరి టొరెంట్ గ్రూప్ రెవెన్యూ రూ.3 వేల కోట్లుగా ఉంటుందని సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.