
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ గా వినిపిస్తున్న వార్తలు. సెలబ్రెటీల పై సోషల్ మీడియా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంటుంది. వారి లైఫ్ లో ఎం జరుగుతుంది. ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉన్నారో లాంటి వార్తలతో పాటు సినిమా విషయాలు కూడా సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు, హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఓ హీరో గురించి. ఒకానొక సమయంలో తెలుగులో హీరోగా మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు ఆయన. రెండో పెళ్లి చేసుకున్న ఆయన తాజాగా 47ఏళ్ల వయసులో తండ్రి అయ్యారు. దాంతో ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?
సాయికిరణ్. ‘నువ్వే కావాలి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘మనసుంటే చాలు’, ‘ఎంత బావుందో’ తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లోనూ సహాయక నటుడిగానూ మెప్పించాడు. సాయి కిరణ్ ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 2010లోనే సాయికిరణ్‌కి వైష్ణవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తనతో పాటు ‘కోయిలమ్మ’ సీరియల్‌లో నటించిన స్రవంతిని పెళ్లాడాడు.
తాజాగా సాయికిరణ్ తండ్రి అయ్యాడు. ఇటీవలే స్రవంతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టాడు అంటూ అనౌన్స్ చేశారు. దాంతో ఆయన సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాగా సాయి కిరణ్ మొదటి భార్యకు కూతురు ఉంది.. అలాగే ఇప్పుడు రెండో భార్య కొడుకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు నెటిజన్స్‌తో పాటు సెలబ్రెటీలు కూడా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.