AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటే లక్కీ బ్యూటీ..! అప్పుడు స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇదే హీరో పక్కన హీరోయిన్‌గా..

ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా క్యూట్ గా కనిపించిన వారు ఇప్పుడు అదిరే మేకోవర్‌తో అవాక్ అయ్యేలా చేస్తున్నారు. ఏకంగా హీరో.. హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కల్యాణ్ రామ్ కూడా హీరోయిన్‌గా దూసుకుపోతుంది

వాటే లక్కీ బ్యూటీ..! అప్పుడు స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇదే హీరో పక్కన హీరోయిన్‌గా..
Actress
Rajeev Rayala
|

Updated on: May 19, 2025 | 10:37 AM

Share

చాలా మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎంతో మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి అలరించారు. ఇక వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తెలుగులో తేజా సజ్జా.. హీరోగా మారి ఆతర్వాత హనుమాన్ సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. అటు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీవిధ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్.. ఇలా చాలా మంది చిన్నప్పుడు తమ నటనతో ఆకట్టుకుని.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ హీరో, హీరోయిన్స్ అందరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఓ చిన్నది ఓ స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు అదే హీరో సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : గోవిందుడు అందరివాడేలేలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు చూస్తే చెక్ అవ్వాల్సిందే..

ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. కృతి శెట్టి. ఈ చిన్నది తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది, ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్. చిన్నతనం కృతి శెట్టి ఐడియా, షాపర్స్ స్టాప్, పార్లే, లైఫ్‌బాయ్ వంటి పలు బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు కార్తీ హీరోగా నటించిన నా పేరు శివ సినిమాలో ఇలా కనిపించి అలా వెళ్తుంది కృతిశెట్టి.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! ఈ ఫొటోలో స్కూల్ డ్రస్ వేసుకున్న రెండు జెళ్ళ పాప గుర్తుందా.? ఇప్పుడెలా ఉందంటే

ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా చేస్తుంది. వా వాతియార్ అనే సినిమాలో కార్తీకి జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. నలన్ కుమారసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక కృతిశెట్టి  కార్తీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు హీరోయిన్ గా నటించడం పై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 15 ఇయర్స్ ఛాలెంజ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇది కూడా చదవండి : సీన్ సీన్‌కు సితారే..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా మావ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

View this post on Instagram

A post shared by Reel Beyond (@reel.beyond)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోజు సాయంత్రం ఈ ఒక్క సింపుల్ ట్రిక్ పాటిస్తే సరి.. సన్నబడటం ఖాయం!
రోజు సాయంత్రం ఈ ఒక్క సింపుల్ ట్రిక్ పాటిస్తే సరి.. సన్నబడటం ఖాయం!
నెహ్రూను మించి మోదీ సక్సెస్‌కు కారణం ఇదే.. లెక్కలతో సహా చెప్పిన
నెహ్రూను మించి మోదీ సక్సెస్‌కు కారణం ఇదే.. లెక్కలతో సహా చెప్పిన
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?