AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటి భర్తకు విడాకులు.. తనకన్నా 12 ఏళ్ల చిన్నవాడితో ఎఫైర్.. ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ఆమెదే. అందం, అభినయంతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసింది. హీరోయిన్ కాదు.. అయినా స్పెషల్ పాటలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది.

మొదటి భర్తకు విడాకులు.. తనకన్నా 12 ఏళ్ల చిన్నవాడితో ఎఫైర్.. ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 13, 2026 | 5:13 PM

Share

ఇటీవల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తెగ సందడి చేస్తున్నాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న అందులోని స్పెషల్ సాంగ్స్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలకు మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి స్పెషల్ సాంగ్స్. అప్పట్లో స్పెషల్ సాంగ్స్ కోసం కొంతమంది ముద్దుగుమ్మలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. తమన్నా, సమంత, శ్రీలీల, శ్రుతిహాసన్ లాంటి హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. తమన్నా హిందీ సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసిన దుమ్మురేపుతోంది. అలాగే ఇటీవలే విడుదలైన పెద్ది సినిమాలో శ్రుతి స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. ఆమె సాంగ్ చేసిందంటే అది వైరల్ అవ్వాల్సిందే.. దాంతో రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తుంది ఆమె..

స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తూనే కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ అందుకుంటుంది ఆ హాట్ బ్యూటీ. స్పెషల్ సాంగ్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఈ అమ్మడే. ఆ బ్యూటీ మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పెషల్ సాంగ్స్ కు మలైకా అరోరా పెట్టింది పేరు. తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో సాంగ్ చేసింది.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏజ్ 50కి పై మాటే… ఇప్పటికీ తరగని అందంతో, కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఉంది మలైకా. అంతే కాదు పెళ్లి చేసుకోకుండగా సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తుంది. మొదట్లో సల్మాన్ ఖాన్ తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. ఆతర్వాత అతనితో విడాకులు తీసుకుంది. ఆమధ్య యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడిపించి ఆతర్వాత బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది. ఇటీవలే కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించిందని బీటౌన్ లో టాక్ వినిపించింది. ఇక మలైకా స్పెషల్ సాంగ్స్ తగ్గించింది. అప్పట్లో దబాంగ్’ సినిమాలో ‘మున్నీ బద్నామ్ హుయీ’ సాంగ్ కోసం ఏకంగా రూ.2.5 కోట్లు అందుకుంది. ప్రస్తుతం సోషల్  మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది.

మలైకా అరోరా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us