ఆయన ఓ గొప్ప నటుడు.. కానీ ఆస్తి మొత్తం పనిమనిషికి రాసిచ్చి.. ఉరేసుకొని ఆత్మహత్య

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ ఆయన. ఆయన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 300కి పైగా సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. సీరియల్స్‌లో సైతం మెప్పించారు. ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నాడు. సాహితీవేత్తగానూ గుర్తింపు ఉంది.

ఆయన ఓ గొప్ప నటుడు.. కానీ ఆస్తి మొత్తం పనిమనిషికి రాసిచ్చి.. ఉరేసుకొని ఆత్మహత్య
Tollywood

Updated on: Feb 14, 2026 | 12:24 PM

తెలుగు సినిమా పై ఎంతో మంచి నటీ నటులు చెరగని ముద్ర వేశారు. తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. తన నటనతో ఎలాంటి పాత్రలైనా యిట్టే ఒదిగిపోతారు ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించారు. హీరోల తండ్రిగా అద్బుతమైన నటన చూపించారు. అంత గొప్పనటుడైనా ఆయన ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అంతే కాదు తాను సంపాదించిందంతా ఇంటి పనిమనిషికి రాసి ఇచ్చి చనిపోయారు ఆయన. కడుపునా పుట్టిన పిల్లలు ఉన్నా కూడా పనిమనిషికి ఆస్తి రాసిచ్చి చనిపోయారు ఆయన. ఇంతకూ ఆ నటుడు ఎవరో తెలుసా.?

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

తెలుగుతెరపై తన నటనతో సత్తా చాటుకున్న నటుడు రంగనాథ్. విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఇండస్ట్రీలో రాణించారు. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. 1974లో వచ్చిన చందన సినిమాతో రంగనాథ్‌కు హీరోగా అవకాశం లభించింది. అనంతరం దాదాపు 40 నుంచి 50 చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు. ఆ తర్వాత రూట్ మార్చి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. దాదాపు దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు ఆయన. సీరియల్స్‌లో కూడా తన మార్క్ చూపించారు. 2015లో రంగనాథ్ ఊహించని రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్‌లోని తన ఇంట్లో సీలింగ్ హుక్‌కు ఉరివేసుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు, కవితలతో ఎందరినో అలరించారు. ఓ సినిమా కూడా డైరెక్ట్ చేశారు. అలాంటి రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు.

కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ప్రమాదవశాత్తూ భార్య మంచాన పడితే.. 15 ఏళ్ల పాటు ఆమెకు సపర్యలు చేశారు రంగనాథ్. 2009లో భార్య చైతన్య మృతి చెందడంతో ఆయన చాలా కుంగిపోయారని ఇండస్ట్రీలో చెబుతుంటారు. రంగనాథ్‌కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. రంగనాథ్ చనిపోయే ముందు ఆయన స్నేహితుడు, నేటి నిజం ఎడిటర్ బైసా దేవదాసుకు గుడ్ బై సార్ అనే మేసేజ్ పంపారట. అంతే కాదు ఆయన ఉరివేసుకున్న రూమ్‌లో ఓవైపు గోడపై నా బీరువాలో ఆంధ్రాబ్యాంక్ బాండ్స్ ఉన్నాయి.. అవి పనిమనిషి మీనాక్షికి అప్పగించండి.. డోంట్ ట్రబుల్ హర్ అని రాసి ఉంచారు. తనతో పాటు తన భార్యకు అన్నేళ్లపాటు పనిమనిషి మీనాక్షి చేసిన సేవ మర్చిపోకుండా ఆమెకు తగిన న్యాయం చేసేందుకు ఆయన అలా చేశారని ఆయన పిల్లలు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి