AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్నది ఆ హీరోయిన్ కూతురా.!! అందంలో అమ్మను మించిపోయిందిగా..

సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు చాలా మంది ముద్దుగుమ్మలు. అలాగే ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఈ చిన్నది ఆ హీరోయిన్ కూతురా.!! అందంలో అమ్మను మించిపోయిందిగా..
Jovika
Rajeev Rayala
|

Updated on: May 09, 2026 | 2:53 PM

Share

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో పాటు వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొంతమంది కావాలని వార్తల్లోకి ఎక్కుతుంటే మరికొంతమంది మాత్రం తెలిసి తెలియక చేసిన కామెంట్స్ తో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేసింది. చేసిన సినిమాలు తక్కువే కానీ వివాదాలతో పాపులర్ అయ్యింది. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని అందరిని షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది. నలుగురిని పెళ్లి చేసుకొని.. ఆ నలుగురితో విడిపోయి ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది.. ఇప్పుడు ఆ హీరోయిన్ కూతురు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పైన కనిపిస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఆమె తాత, అమ్మమ్మ, అమ్మ , పిన్నులు , బాబాయ్ అందరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవారే..

ఆమె మరెవరో కాదు సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ గుర్తున్నారా.? దేవి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. వనిత తండ్రి, తల్లి, అక్క చెల్లెల్లు , తమ్ముడు కూడా సినిమాల్లో రాణించినవారే.. తమిళ్ లో అడపాదడపా సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. అంతే కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచింది వనిత విజయ్ కుమార్. అంతే కాదు  స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతోనూ ఆమె వివాదం పెట్టుకుంది. వీటితో పాటు చాలా కాంట్రవర్షల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

అయితే 2000 సంవత్సరంలో హీరో ఆకాష్‌ను తొలిసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆతర్వాత ఆకాష్ తో విడిపోయింది వనిత.. ఆతర్వాత మరో ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అయితే ఆకాష్, వనితల కూతురు జోవిక ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘అగధ’ మూవీతో జోవికా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Vanitha (@vanithavijaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!