
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు తారక్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ హీరోయిన్ తారక్ అంటే పిచ్చి అని ఆయన ఆటోగ్రాఫ్ కావాలని ఓ ఇంటర్వ్యూలో అడగటం ఆసక్తికరంగా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రముఖ నటి ఖుష్బూ. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినిమా అనుభవాలు అలాగే ఆమె అభిమాన నటులు, భవిష్యత్ సినీ లక్ష్యాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు అత్యంత ఇష్టమైన హీరో గురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయం చాలా మందికి తెలిసిన వాస్తవమేనని ఆమె పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూకు ఉన్న ఒక కోరిక ఏంటి.? అనే ప్రశ్న ఎదురవగా ఆమె దీనికి స్పందిస్తూ..
తాను జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ పొందాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను తారక్‌కు చాలా పెద్ద అభిమానినని, “తారక్, మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తున్నట్లయితే, నాకు తెలుసు, నేను చాలా పెద్ద ఫ్యాన్‌ను. నాకు ఒక ఆటోగ్రాఫ్, నా పేరు రాసి పంపించండి, అది చాలు నాకు” అని చెప్పుకొచ్చారు. అంతే కాదు తన కోరిక విని తారక్ ఇబ్బంది పడతారేమో అని సరదాగా వ్యాఖ్యానించారు. దీని పై తారక్ కూడా స్పందించారు.. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, గతంలో బృందా గారు ఒక సినిమా పాట షూటింగ్ సమయంలో మొదటిసారి ఖుష్బూ గారితో కలిసి మాట్లాడా అని తెలిపారు తారక్. ఖుష్బూ వంటి సీనియర్ నటి, బాబాయ్‌తో (నందమూరి బాలకృష్ణ) కానివ్వండి, తమిళంలో, తెలుగులో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, తన పట్ల అలాంటి ప్రశంసను వ్యక్తం చేయడం ఒక తెలియని, గర్వంగా ఫీల్ అయ్యే అనుభూతి అని తారక్ అన్నారు.
నటిగా కంటే, ఒక మంచి వ్యక్తిగా కూడా ఖుష్బూను అభివర్ణించారు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కావలి అని ఆమె అడగడం అది తీరని కోరిక అని చెప్పడం గొప్ప అనుభవం అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే తాను యమదొంగ చిత్రంలో ఖుష్బూతో నటించానని, అయితే వారిద్దరి మధ్య కాంబినేషన్ సీన్లు లేవని, ఆమె మోహన్ బాబు గారికి భార్యగా నటించారని గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్. భవిష్యత్తులో ఖుష్బూతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.