Nani : నానితో ఉన్న ఈ అమ్మడు ఎవరో తెలుసా..? ఆమె ఒక క్రేజీ హీరోయిన్..

హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మృణాల్, నాని యాక్టింగ్ కు జనాలు ఫిదా అయ్యారు. అలాగే ఈ చిత్రంలో మృణాల్ చెల్లిగా కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ చిన్నది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ ... సోషల్ మీడియాలో క్రేజీ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.

Nani : నానితో ఉన్న ఈ అమ్మడు ఎవరో తెలుసా..? ఆమె ఒక క్రేజీ హీరోయిన్..
Nani

Updated on: May 03, 2025 | 8:35 PM

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, రీసెంట్ గా హిట్ 3 సినిమాలతో అందుకున్నాడు నాని. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 సినిమా భారీ హిట్ అందుకున్నాడు. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ లోనూ కుమ్మేస్తుంది. నాని మరోసారి మాస్ అవతార్ లో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే నానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అలాగే ఇప్పుడు నాని ఫొటో ఒకటి చక్కర్లు కొడుతుంది.ఈ ఫొటోలో నానితో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఆ అమ్మడు నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించింది.

నానితో కలిసి ఉన్న ఈ అమ్మాయి పేరు దృష్టి తల్వార్. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ 1998 ఆగస్ట్ 30న జన్మించింది. ముందుగా టిక్ టాక్ వీడియోస్, ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్, ఇన్ స్టాలో రీల్స్ చేసి చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2022లో పంజాబీ చిత్రం చోబ్బర్ తో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఓవైపు పంజాబీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక అదే క్రేజ్ తో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇందులో మృణాల్ ఠాకూర్ చెల్లి పాత్రలో కనిపించింది. అలాగే ఈ అమ్మడు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసింది. మొన్నామధ్య ఫ్లై అనే పంజాబీ పాటలో కనిపించింది ఈ వయ్యారి.. ప్రస్తుతం ఆమె ఇన్ స్టాలో 139 కే ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు గురించి సెర్చింగ్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి