AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే..!! ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టరా.? ఆమె ఎవరంటే

ఇన్నాళ్లు కథానాయికగా అలరించిన సమంత ఇప్పుడు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే తిరిగి సినీరంగంలో యాక్టివ్ అవుతున్న సామ్.. అటు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలాగే ఇటు ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టింది. కొన్నాళ్ల క్రితమే ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది సామ్. ఇదిలా ఉంటే.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’.

మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే..!! ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టరా.? ఆమె ఎవరంటే
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: May 03, 2025 | 8:10 PM

Share

సమంత రూత్ ప్రభు నిర్మాతగా తొలి అడుగు వేసిన చిత్రం ‘శుభం’. ఈ సినిమాని సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో రూపొందింది. మే 9, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘శుభం’ సినిమా ట్రైలర్ గురించి చెప్పాలంటే.. ఒక ఊరిలోని మహిళలు టీవీ సీరియల్స్‌కు అతిగా అలవాటు పడి, ఆ తర్వాత దెయ్యాల్లా ప్రవర్తించడం చుట్టూ కథ నడుస్తుందని అర్థమవుతోంది. ఈ కథాంశం వినోదాత్మకంగా, అదే సమయంలో ఉత్కంఠభరితంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సమంత ఈ చిత్రంలో మాతాజీ పాత్రలో కనిపించనుంది. ఆమె లుక్  ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇదిలా ఉంటే శుభం సినిమాలో నటించిన ఈ నటిని గుర్తుపట్టారా.? ఆమె పేరు శ్రియ కొంతం. ఈ చిన్నది గతంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించి మెప్పించింది. గ్యాంగ్ లీడర్ సినిమాతో ఫేమస్ అయిన ఈ అమ్మడు మరో సినిమాలో కనిపించలేదు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట అరాచకం సృష్టించింది

ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శుభం సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ట్రైలర్ లో ఆమె నటన ఆకట్టుకుంది. ఈ సినిమాతో శ్రియ కొంతం మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ ఈ చిన్నది అవకాశాలు అందుకుందని తెలుస్తుంది. శుభం సినిమాలో దెయ్యం పట్టిన యువతిగా తన నటనతో ఆకట్టుకుంది శ్రియ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..