ఈ ఫొటోలో చిరు, పవన్ తో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? ఆయన కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ ఫొటోలో చిరు, పవన్ తో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? ఆయన కొడుకు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు
Chiranjeevi, Pawan Kalyan

Updated on: Sep 06, 2025 | 9:37 PM

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చిపోయి అభిమానులు చాలా మంది ఉన్నారు. మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అభిమానులు మెగా ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఒకప్పటి పిక్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఈ ఓల్డ్ ఫొటోలో పవన్, చిరు లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫోటో చూస్తుంటే చిరు.. పవన్ ఏదో ఈవెంట్ కు హాజరైనట్లుగా తెలుస్తోంది. నెట్టింటిని షేక్ చేస్తోన్న ఆ ఫోటోలో చిరు, పవన్ తో ఓ వ్యక్తి ముచ్చటిస్తూ కనిపిస్తున్నారు. ఆయనతో చిరు మాట్లాడుతుండగా.. పవన్ చిరునవ్వుతో అతడిని చూస్తున్నారు. అయితే వారిద్దరి మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

ఆయన ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ రైటర్. తను మరెవరో కాదు.. గొర్తి సత్యమూర్తి అలియాస్ జి. సత్యమూర్తి. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తండ్రే జి. సత్యమూర్తి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న జన్మించారు జి.సత్యమూర్తి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రానికి రైటర్ గా పనిచేశారు సత్యమూర్తి. ఈ సినిమాతోనే ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బావా మరదళ్లు, కిరాయి కోటిగాడు, ఖైదీ నంబర్ 786, అభిలాష, పోలీస్ లాకప్, ఛాలెంజ్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన కథలు రాశారు.

ఇది కూడా చదవండి : ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

1980,90లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. అందులో బంగారు బుల్లోడు, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి, అమ్మ దొంగా, చంటి, శ్రీనివాస కళ్యాణం, పెద రాయుడు, మాతృదేవోభవ, రౌడీ అన్నయ్య చిత్రాలకు రైటర్ గా పనిచేశారు సత్యమూర్తి. తెలుగులో దాదాపు 400కు పైగా సినిమాకు ఆయన రచయితగా పనిచేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్, జానీ చిత్రాలకు కూడా ఆయన రచయితగా పనిచేశారు. అయితే అనారోగ్య సమస్యలతో ఆయన 2015 డిసెంబర్ 14న చెన్నైలో కన్నుమూశారు. ఆయన కొడుకు దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.