
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న హీరోయిన్స్ లో కీర్తిసురేష్ ఒకరు. ఈ అమ్మడు తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో పాటు అబ్బురపరిచే నటనతో తెలుగుతో పాటు తమిళ్ లోనూ ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. నేను శైలజా దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన దసరా వరకు కీర్తి తన సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మహానటి సినిమాలో కీర్తిసురేష్ అచ్చం సావిత్రి గారిలా నటించి ఆకట్టుకుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది. ఇక ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కెరీర్ బినింగ్ లో పద్దతిగా పెద్ద స్కిన్ షో చేయకుండా ఉన్న ఈ భామ. ఇప్పుడు ఆ హద్దులను చెరిపేసింది. ఈ మధ్య వచ్చిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది కీర్తిసురేష్.
ఇదిలా ఉంటే ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే తాజాగా ఈ చిన్నదాని ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో కీర్తి సురేష్ ఓ వ్యక్తితో క్లోజ్ గా కనిపించింది. దాంతో ఆమె అభిమానులు మండిపడుతున్నారు. నా మ్యూజిక్ సిస్టం మీద ఎవడో చెయ్యి వేశాడు.. ఎవడ్డాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకు కీర్తితో క్లోజ్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే.. కీర్తిసురేష్ షూటింగ్ సెట్ లో అందరితో ఎంతో క్లోజ్ గా ఉంటుంది. అందరితో స్నేహం చేస్తూ ఉంటుంది. సెట్ లో ఉన్న అందరితో సరదాగా మాట్లాడుతూ.. ఫోటోలు దిగుతూ ఉంటుంది. అలాగే సెట్ లో ఓ మెకానిక్ తో ఫోటో దిగింది. ఇదే ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది.