AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసగా వేశ్యపాత్రలే.. ఆ హీరో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చి..కెరీర్‌ను నిలబెట్టారు

సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్స్ ప్రేక్షకుల మనస్సులో చరగాని ముద్ర వేశారు. కొంతమంది హీరోయిన్స్ సినిమాలతోనే కాదు.. వ్యక్తిగత విషయాల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు.

వరుసగా వేశ్యపాత్రలే.. ఆ హీరో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చి..కెరీర్‌ను నిలబెట్టారు
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 03, 2026 | 12:59 PM

Share

సినీ రంగంలో నటులపై పాత్రల ప్రభావం చాలా కాలం ఉంటుంది. కొంతమంది హీరోయిన్ ఏదైనా ఒక పాత్ర చేసి క్లిక్ అయితే చాలు అదే తరహా పాత్రలు కంటిన్యూ అవుతుంటాయి.ఆ అలాగే కొంతమంది మీద ఆ పాత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సినిమాల్లో వ్యాంప్ పాత్రలు చేసిన, విలన్ పాత్రలు చేస్తే చాలా మంది బయట కూడా వాళ్లు అలానే ఉంటారు అని కొందరు భవిస్తూ ఉంటారు. అలాగే ఓ హీరోయిన్ కు కూడా జరిగింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ డాన్సర్, నటి రాజసులోచన. ఆవిడ జీవితం ఒక నిదర్శనం. ఆమె కెరీర్ తొలినాళ్లలో వేశ్య పాత్రలకు మాత్రమే పరిమితమై, అదే ముద్రతో వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే, నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి చొరవతో ఆమె కెరీర్ ఒక కీలక మలుపు తిరిగింది.

రాజసులోచన అసలు పేరు రాజలోచన. ఆమె తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె కావడంతో ఎంతో గారాబంగా పెరిగారు. రాజా అనే పదం గౌరవనీయంగా భావించే ఆ రోజుల్లో, ఆమె పేరును రాజలోచనగా నిర్ణయించారు. అయితే, పాఠశాలలో చేర్పించే సమయంలో పొరపాటున ఆమె పేరు రాజసులోచనగా నమోదై, అదే పేరు ఆమెకు స్థిరపడింది. ఆమెకు నృత్యం అంటే ప్రాణం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నృత్యంలో రాణించారు. విజయవాడలో పుట్టినప్పటికీ, తండ్రి చెన్నైకి వలస వెళ్లడంతో ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. సినిమాల్లోకి ప్రవేశించినప్పుడు రాజసులోచనకు తొలి అవకాశం వేశ్య పాత్రలో వచ్చింది. తండ్రికి ఇష్టం లేకపోయినా, తల్లి ప్రోత్సాహంతో ఆమె ఆ పాత్రను పోషించారు. దురదృష్టవశాత్తు, ఈ పాత్ర తర్వాత ఆమె వేశ్య పాత్రల నటిగా ముద్రపడిపోయారు. వరుసగా అలాంటి పాత్రలే వస్తూ ఉండటంతో, ‘ఇవి తప్ప ఇంకేమీ రావా’ అనే ప్రశ్న ఆమెను నిరంతరం వేధించేది. అంతేకాకుండా, బయట ప్రజలు ఆమెను చూసినప్పుడు, “మీరు ఆ పాత్రల్లో జీవించారు, మీకు వేశ్య పాత్రలు బాగా నప్పుతాయి, మా సినిమాలో నటిస్తారా” అంటూ అడిగేవారట.

ఈ ముద్ర ఆమె వ్యక్తిగత జీవితంలోనూ తీవ్రమైన ఆటుపోట్లకు కారణమైంది. అయితే, ఈ పరిస్థితిని మార్చడానికి నందమూరి తారక రామారావు గారు కీలక పాత్ర పోషించారు. ఆయన రాజసులోచనకు ‘బందిపోటు’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం కల్పించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ‘బందిపోటు’ సినిమా విజయంతో రాజసులోచన కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆమె స్టార్ హీరోయిన్‌గా స్థిరపడ్డారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాజసులోచన కాంబినేషన్‌లో మరో మూడు సినిమాలు వచ్చి, అవి కూడా ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. క్రమంగా ఆమె క్యారెక్టర్ పాత్రల వైపు కూడా దృష్టి సారించారు. ఈ విధంగా వేశ్య పాత్రల నటిగా ముద్రపడిన రాజసులోచనను స్టార్ హీరోయిన్‌గా ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఆయన చూపిన చొరవ, ఇచ్చిన అవకాశం ఆమె సినీ ప్రస్థానాన్ని సరికొత్త దిశగా మలుపు తిప్పాయి.

Rajasulochana

Rajasulochana

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us