
జూనియర్ ఎన్టీఆర్ ఇండియన్ సినిమాలో ఫైనెస్ట్ యాక్టర్. అంతే స్థాయి డ్యాన్సర్ కూడా. మంచి కథ పడితే జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ప్రదర్శన ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తారక్ తాను నటించిన యమదొంగ, కంత్రీ, ఊసరవెల్లి, రభస, నాన్నకు ప్రేమతో సినిమాల్లో పాటలు పాడారు. అలానే ఓ కన్నడ పాటను ఆలపించారు. మరి తారక్‌కు ఇష్టమైన సాంగ్ ఏంటో తెలుసా..? కంచరపాలెం సినిమాలోని ఆశ పాశం పాట. RRR సినిమా అప్పుడు.. ప్రమోషన్ల భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పేర్లే మానేతో ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన గాన ప్రతిభను ప్రదర్శించారు. ఇంటర్వ్యూయర్ “మీ ఫోన్‌లో ఎక్కువగా ప్లే అయ్యే పాట ఏది?” అని అడగగా, ఎన్టీఆర్ వెంటనే “ఆశ పాశం” అనే పాట తన ఫోన్‌లో ఎక్కువగా వింటానని సమాధానం ఇచ్చారు. ఈ పాట కేరాఫ్ కంచరపాలెం చిత్రంలోనిది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆ పాటలోని కొన్ని పంక్తులను పాడారు. ఎన్టీఆర్ గానం విన్న వెంటనే రామ్ చరణ్ “నేను చెప్పాను కదా, అతను పాడగలడని” అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గానాన్ని విన్న ఇంటర్వ్యూయర్ “అద్భుతం! మలయాళంలో దీన్ని అడిపొలి అంటారు. మీరు ఇంత బాగా పాడగలరని నేను ఊహించలేదు” అంటూ ప్రశంసించారు. RRR చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్ర తన కొమురం భీముడో పాట ద్వారా ప్రజల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినట్లే, ఆయన నిజ జీవితంలో కూడా అద్భుతమైన గాత్రం కలిగి ఉండటం ఆసక్తికరం. ఈ సంఘటన ఎన్టీఆర్‌ను టాలీవుడ్ ఆల్‌రౌండర్ అని పిలవడానికి గల అనేక కారణాలలో ఒకటిగా నిలుస్తుంది.
కాగా వెంకటేష్ మహా కేరాఫ్ కంచరపాలెం చిత్రాన్ని తెరకెక్కించారు. స్వీకర్ అగస్తీ ఈ పాటకు బాణీ కట్టగా.. విశ్వ లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను తన గాత్రంతో మరో స్థాయికి తీసుకెళ్లారు.