Vijay Sethupathi: ఆన్‌లైన్‌లో చాటింగ్.. ఆపై ప్రేమ పెళ్లి.. విజయ్ సేతుపతి లవ్ స్టోరీ తెలుసా ?..
విజయ్ సేతుపతి తన నటనా జీవితం ప్రారంభించక ముందు అకౌంటెంట్‌గా పనిచేశాడు. నవంబర్ 2000లో, ముంబైలో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన తర్వాత విజయ్ అకౌంటెంట్‌గా పని చేయడానికి దుబాయ్‌కి వెళ్లాడు. ఆ సమయంలో అతని జీతం రూ.12,000. ఇక విజయ్ సేతుపతి తన సతీమణి జెస్సీని చూడకుండానే ప్రేమించారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అగ్రకథానాయకుల జాబితాలో వన్ ఆఫ్ ది హీరో విజయ్ సేతుపతి. దాదాపు 50 కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు విజయ్. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న జవాన్ చిత్రంలో విలన్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు మక్కల్ సెల్వన్. డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో నయనతార, దీపికా పదుకొనే నటించారు. ఈ సినిమాలో ఆయుధ వ్యాపారి కాళీ గైక్వాడ్ పాత్రలో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న విజయ్ సేతుపతి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు.. ఆయన ప్రేమ, పెళ్లి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చారు.
విజయ్ సేతుపతి తన నటనా జీవితం ప్రారంభించక ముందు అకౌంటెంట్‌గా పనిచేశాడు. నవంబర్ 2000లో, ముంబైలో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన తర్వాత విజయ్ అకౌంటెంట్‌గా పని చేయడానికి దుబాయ్‌కి వెళ్లాడు. ఆ సమయంలో అతని జీతం రూ.12,000. ఇక విజయ్ సేతుపతి తన సతీమణి జెస్సీని చూడకుండానే ప్రేమించారు. దుబాయ్ లో పనిచేస్తున్న సమయంలో తన భార్య జెస్సీ కూడా దుబాయ్ లో ఉండేదని.. ఫేస్ బుక్ చాటింగ్ ద్వారా తాము స్నేహితులమయ్యామని అన్నారు.
View this post on Instagram
విజయ్ మాట్లాడుతూ.. “జెస్సీ… నా స్నేహితురాలి సహోద్యోగి. మేము ఆన్‌లైన్‌లో చాట్ చేసేవాళ్లం. నవంబర్ 2003లో, నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి వెళ్లాను. అప్పుడు నా వయసు కేవలం 24 సంవత్సరాలు. మా పెద్దల సమక్షంలో మేము పెళ్లి చేసుకున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. విజయ్, జెస్సీ దంపతులకు కుమారుడు సూర్య, కుమార్తె శ్రీజ ఉన్నారు. విజయ్ సేతుపతి నటించిన సూపర్ డీలక్స్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. ఇక పెళ్లికి ముందు తన భార్య బాలీవుడ్ హీరో షారుఖ్ అభిమాని అని.. ఇప్పటికీ ఆయనకు వీరాభిమాని అని అన్నారు.
View this post on Instagram
ఇక ప్రస్తుతం భారీ వసూళ్లతో దూసుకుపోతున్న జవాన్ చిత్రానిగానూ విజయ్ సేతుపతికి దాదాపు రూ.21 కోట్లు పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఫిట్నెస్, డైటింగ్ అనే విషయాలను ఎక్కువగా పట్టించుకోనని.. రుచికరమైన ఆహారాన్ని తినడానికి ముందుంటానని అన్నారు. రుచికరమైన ఆహారం తినకపోతే జీవితం కూడా రుచిగా ఉండదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.