
ఆరుపదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. వరుసగా వంద కోట్ల సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహరాజ్ సినిమాలన్నీ దాదాపు వంద కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించాయి. అయితే గతేడాది చివరిలో రిలీజైన అఖండ 2 తాండవం మాత్రం ఆ రేంజ్ లో కలెక్షన్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం వీరసింహారెడ్డి ఫేమ్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. దీని తర్వాత కొరటాల శివతోనూ ఓ మూవీకి కమిట్ అయ్యారు నందమూరి నటసింహం. కాగా బాలయ్య ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించారు. అలాగే ఎంతో మంది హీరోయిన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం బాలయ్యకు చెల్లిగా, వదినగా, భార్యగా, లవర్‌గా నటించింది. ఆమె మరెవరో కాదు రోజా సెల్వమణి.
సినిమాల్లో బాలకృష్ణ, రోజాలది సక్సెస్ ఫుల్ పెయిర్ అని చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషన్‌లో మొత్తం 7 సినిమాలొచ్చాయి. దాదాపు అన్ని చిత్రాలు మంచి విజయం సాధించాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది భైరవ ద్వీపం. సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ క్లాసిక్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘బొబ్బిలి సింహం’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ఇదే కాంబినేషన్ లో వచ్చిన ‘మాతో పెట్టుకోకు’ కూడా నందమూరి అభిమానులకు బాగానే నచ్చింది. ఈ మూడు సినిమాల్లోనూ బాలయ్య- రోజాల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
అయితే సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలోనే ‘శ్రీ కృష్ణార్జున యుద్దం’ సినిమాలో బాలయ్య, రోజా కలిసి నటించారు. ఈ సినిమాలో బాలయ్య కృష్ణుడు, అర్జునుడు పాత్రల్లో నటించగా.. రోజా ద్రౌపది పాత్రలో నటించింది. ద్రౌపదిని కృష్ణుడు ఎప్పుడూ కూడా తన సొంత సోదరిగా భావిస్తాడు. అంటే ఈ సినిమాలో బాలయ్య-రోజాలది అన్నా చెల్లెళ్ల పాత్రలన్నమాట. ఇక ‘పెద్దన్నయ్య’ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో పెద్ద బాలకృష్ణకు భార్యగా రోజా నటించింది. ఇంకో బాలయ్యకు వదినగా నటించింది. అలాగే ‘సుల్తాన్’ సినిమాలో కూడా వీరిద్దరి కలిసి నటించారు. ఈ మూవీలో కూడా బాలయ్య డబుల్ రోల్ లో మెరిశాడు. అయితే భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక చివరి సారిగా బాలయ్య- రోజా కాంబినేషన్ లో ‘శ్రీరామ రాజ్యం’ సినిమా వచ్చింది. ఇందులో రోజా భూదేవి పాత్రలో నటించింది. అలా బాలయ్యకు భార్యగా, వదినగా, చెల్లిగా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్‌గా రోజా నిలిచిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.